ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. మిక్స్డ్ పెయిర్ విభాగంలో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ స్వర్ణం సాధించారు. ఈ టోర్నీలో మనకు ఇదే తొలి పసిడి కావడం విశేషం. మొత్తంగా ఈ టోర్నీలో ఏడు పతకాలు సాధించి సత్తాచాటారు.
చైనీస్ తైపీ జంట స్యూన్ చెన్- లు చెన్‌తో జరిగిన ఫైనల్లో 158-151 తేడాతో వర్మ-జ్యోతి విజయం సాధించారు. ఈ పతకంతో భారత్.. మొత్తంగా ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో టోర్నీని ముగించింది.
-
Jyothi Surekha Vennam and Abhishek Verma beat Chinese Taipei in the Asian championship final! 🥇🌏🏹 #archery pic.twitter.com/rbnjQmSj78
— World Archery (@worldarchery) November 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jyothi Surekha Vennam and Abhishek Verma beat Chinese Taipei in the Asian championship final! 🥇🌏🏹 #archery pic.twitter.com/rbnjQmSj78
— World Archery (@worldarchery) November 27, 2019Jyothi Surekha Vennam and Abhishek Verma beat Chinese Taipei in the Asian championship final! 🥇🌏🏹 #archery pic.twitter.com/rbnjQmSj78
— World Archery (@worldarchery) November 27, 2019
పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత బృందం.. ఫైనల్‌లో ఓటమిపాలైంది. కొరియాపై 232-233 తేడాతో ఓడి, కేవలం ఒక్క పాయింట్‌తో స్వర్ణాన్ని చేజార్చుకుంది.
మహిళల టీమ్ కాంపౌండ్ ఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం కొరియా జట్టుపై ఓటమిపాలైంది. 215-231 తేడాతో పరాజయం చెందింది.
భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉన్న కారణంగా.. ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు.
ఇవీ చూడండి.. ఆర్చరీలో అతన్దాస్కు కాంస్య పతకం