తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే సన్నీ లియోనీ.. క్రీడా నైపుణ్యంతోనూ కట్టిపడేస్తోంది. ఫుట్‌బాల్ ఆడుతూ ఆకట్టుకుంది. అబుదాబీలో జరుగుతోన్న టీ10 లీగ్‌లో దిల్లీ బుల్స్ తరఫున ప్రచారం చేస్తున్న ఈ భామ.. సరదాగా సాకర్ ఆడి అలరించింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
- View this post on Instagram
What's my name..what's my name? 🎶 #SunnyLeone @delhibullst10 @t10league Outfit @fancypantsofficial
">
"వాట్స్ మై నేమ్..వాట్స్ మై నేమ్?" అనే క్యాప్షన్ జోడించి ఈ వీడియోను షేర్ చేసింది సన్నీ. ఇందులో వరుసగా గోల్స్ కొడుతూ నెటిజన్లను కట్టిపడేసింది. ఈ సమయంలో ఆమె భర్త డేనియల్ వెబర్ వెంటే ఉన్నాడు.
దుబాయ్‌లో జరుగుతున్న టీ10లీగ్‌లో దిల్లీ బుల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సన్నీ లియోనీ. ఈ జట్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నాడు.
ఇదీ చదవండి: "మణికట్టు స్పిన్నర్లకు 'గులాబి' కలిసొస్తుంది"