టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
అయితే ధోనీ మరి కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లూ మహీ రిటైర్మెంట్పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈ విషయంపై స్పందించారు. భారతరత్న అవార్డు గ్రహీత లతా జీ.. ధోనీ రిటైర్‌మెంట్ వార్తలపై ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. "ధోనీ గారూ! నమస్కారం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతారనే వార్తలను కొన్ని రోజుల నుంచి వింటున్నా. మీరు మరి కొన్నాళ్ల పాటు దేశం తరఫున క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. రిటైర్ కావాలనే ఆలోచన కూడా మీ మనస్సులో రావద్దని ఆశిస్తున్నా. మరి కొంతకాలం క్రికెట్ ఆడాలని కోరుకునే అభిమానుల్లో నేనూ ఒకరిని" అంటూ ట్వీట్ చేసింది.
ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత జట్టు..ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్‌లో ధోనీ, రవీంద్ర జడేజా కొద్దిసేపు జాగ్రత్తగా ఆడారు. వీరు క్రీజులో ఉన్నంతసేపు గెలుపుపై ఆశలుండేవి. ఇద్దరూ ఔటైన వెంటనే టీమిండియా ఓటమి ఖరారైంది.
ఇవీ చూడండి.. టీమిండియాకు బై చెప్పేసిన ఫర్హాట్..