2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లో వెనుదిరగటం తప్ప.. మిగిలిన అన్ని సిరీస్‌లు సంతృప్తినిచ్చాయని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్ శైలి మెరుగయ్యిందని అభిప్రాయపడ్డాడు.
"ఈ ఏడాది సంతృప్తికరంగా సాగింది. ప్రపంచకప్‌లో ఓటమి తప్పితే మిగతా అన్ని ఫార్మాట్లలో జట్టుగా రాణించాం. నేను నా బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తాను. కానీ ఇది ఇంతటితో ఆగదు. వచ్చే ఏడాది మరింత బాగుంటుందని భావిస్తున్నా."
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్.
భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని అనుకుంటానని తెలిపిన రోహిత్ ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించి టాప్‌లో నిలవడమే లక్ష్యంగా ఆడతామని స్పష్టం చేశాడు.
"దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సవాళ్లు ఎదురయ్యాయి. ఒకసారి విజయం సాధించాక ప్రతి మ్యాచ్ గెలుపే లక్ష్యంగా ఆడాం. అగ్రస్థానంలో నిలవడంపైనే మా దృష్టంతా."
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
ఈ ఏడాది రోహిత్ ఆడిన అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 2,442 పరుగులు సాధించి జయసూర్య రికార్డును అధిగమించాడు. ఇందులో 10 శతకాలున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి సత్తాచాటాడు.
ఇదీ చదవండి: ఛాలెంజర్ ట్రోఫీలో హర్మన్, స్మృతి, వేద సారథ్యం