భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. ఇటీవలి మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఈ మైదానంలో సగటున 250 నుంచి 270 పరుగులు నమోదవుతున్నాయి.
ఇందులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలనుకుంటున్నాయి ఇరు జట్లు. ఇటీవలే టీ20 సిరీస్ నెగ్గిన భారత్.. జోరు కొనసాగించాలనుకుంటోంది. పొట్టి ఫార్మాట్లో పరాభవం చెందిన విండీస్.. వన్డేల్లోనైనా నెగ్గి విజయంతో స్వదేశం వెళ్లాలనుకుంటోంది.
జట్లు..
భారత జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), కేదార్ జాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి.
వెస్టిండీస్ జట్టు: షై హోప్, సునిల్ ఆంబ్రిస్, షిమ్రన్ హెట్మెయిర్, రోస్టన్ ఛేజ్, నికోలస్ పూరన్(కీపర్), కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, షెల్డన్ కాట్రెల్, హేడెన్ వాల్ష్, అల్జారీ జోసెఫ్.
ఇదీ చదవండి: వాన్ ట్వీట్‌పై రగడ.. కౌంటర్ ఇస్తున్న మాజీలు