టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అంటే సహనానికి మారుపేరు. అతడి ఒంటికి చెమట పట్టిందంటే.. ఔట్ చేయడానికి బౌలర్ల సహనానికి పరీక్ష. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు ఓటమికి అడ్డుగోడగా నిలిచేవాడు. 2008లో ఆస్ట్రేలియాపై ఒక పరుగు చేసేందుకు అతడు 40 బంతులు ఆడాడు. 18 పరుగులతో ఉన్న అతడు ఎట్టకేలకు ఒక పరుగు తీయగానే సిడ్నీ క్రికెట్ మైదానంలోని అభిమానులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వారి క్రీడా స్ఫూర్తికి ద్రవిడ్ కూడా బ్యాట్‌తో వందనం చేశాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నాడు. తొలిరోజు స్టీవ్ స్మిత్ దాదాపు 38 బంతులు ఎదుర్కొని సింగిల్ తీశాడు. చాలా బంతులు వదిలేసి ఒక పరుగు చేసిన స్టీవ్‌స్మిత్ ఇన్నింగ్స్ సిడ్నీ క్రికెట్ మైదానంలోని మరో డ్రై స్పెల్‌ను గుర్తుచేసింది. 2008లో ద్రవిడ్ వరుసగా 40 బంతులు ఎదుర్కొన్న సందర్భం అది! అని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సందర్భంగా ట్వీట్ చేసింది.
-
Steve Smith's run of dot balls made us think of another famous SCG dry spell - this time it was Rahul Dravid's 40 consecutive dots in 2008!#AUSvNZ #AUSvIND pic.twitter.com/xArETgVYVq
— cricket.com.au (@cricketcomau) January 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Steve Smith's run of dot balls made us think of another famous SCG dry spell - this time it was Rahul Dravid's 40 consecutive dots in 2008!#AUSvNZ #AUSvIND pic.twitter.com/xArETgVYVq
— cricket.com.au (@cricketcomau) January 3, 2020Steve Smith's run of dot balls made us think of another famous SCG dry spell - this time it was Rahul Dravid's 40 consecutive dots in 2008!#AUSvNZ #AUSvIND pic.twitter.com/xArETgVYVq
— cricket.com.au (@cricketcomau) January 3, 2020
ఈ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, సిమన్స్ వంటి బౌలర్లు లైన్, లెంగ్త్ తప్పకుండా చక్కని లయతో కట్టుదిట్టంగా బంతులు విసిరారు. అవి ద్రవిడ్ కాకుండా మరొకరు ఎదుర్కొనుంటే కచ్చితంగా వికెట్ ఇచ్చేసేవారే! అంత కఠినంగా వచ్చాయా బంతులు! టెస్టు క్రికెట్లో ఒకప్పుడు బౌలర్, బ్యాట్స్‌మన్ మధ్య ఇలాంటి అప్రకటిత యుద్ధం నడిచేది. అవి ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చేవి. ఆ తర్వాత బంతికి ఏం జరుగుతుందా అని ఉత్కంఠ రేపేవి.
ఇదీ చదవండి: అరుదైన ఘనతకు ఒక్క పరుగు దూరంలో విరాట్