టీమిండియా సీనియర్ క్రికెటర్ వసీం జాఫర్ అరుదైన ఘనత సాధించాడు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌తో, 150 మ్యాచ్‌లాడిన తొలి భారత్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. నేటి నుంచే ఈ దేశవాళీ సమరం ప్రారంభమైంది.
విదర్భకు కెప్టెన్‌గా ఉన్న జాఫర్.. గత రెండేళ్లుగా ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు మొత్తంగా 253 ఫస్టక్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.
41 ఏళ్ల ఈ విదర్భ క్రికెటర్.. ఫస్టక్లాస్లో 20 వేల మైలురాయికి మరో 853 పరుగుల దూరంలో ఉన్నాడు. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 318. ఇప్పటివరకు 19,147 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 88 అర్థశతకాలు ఉన్నాయి.
2000 నుంచి 2008 వరకు భారత్ తరఫున 31 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధసెంచరీలు, ఓ ద్విశతకం ఉన్నాయి. 2006లో విండీస్‌పై 212 పరుగులు.. టెస్టుల్లో అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టీమిండియా తరఫున రెండు వన్డేలు కూడా ఆడాడు.
ఇదీ చదవండి: వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింధు క్లిష్టమైన గ్రూపులో