దీపావళి రోజున భారత్‌లో పేలాల్సిన టపాసుల మోత ఆస్ట్రేలియా ఆడిలైడ్‌లో మోగింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విశ్వరూపం చూపించాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు శతకాన్ని అందుకోని ఈ క్రికెటర్.. ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించాడు. నేడు అతడి పుట్టినరోజు కావడం మరో విశేషం.
-
His first T20I 100, and off only 56 balls!
— cricket.com.au (@cricketcomau) October 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Well played to the birthday boy, David Warner! 🔥#AUSvSL pic.twitter.com/scf4ATaDP4
">His first T20I 100, and off only 56 balls!
— cricket.com.au (@cricketcomau) October 27, 2019
Well played to the birthday boy, David Warner! 🔥#AUSvSL pic.twitter.com/scf4ATaDP4His first T20I 100, and off only 56 balls!
— cricket.com.au (@cricketcomau) October 27, 2019
Well played to the birthday boy, David Warner! 🔥#AUSvSL pic.twitter.com/scf4ATaDP4
56 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు వార్నర్. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఫలితంగా శ్రీలంక.. 134 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
కెప్టెన్ అరోన్ ఫించ్(64: 36 బంతుల్లో)తో కలిసి తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు వార్నర్. వేగంగా ఆడుతూ ఫించ్ అర్ధ శతకం పూర్తి చేశాడు. అనంతరం అతడు ఔటైనా.. తన దూకుడును మాత్రం తగ్గించలేదు.

ధాటిగా ఆడుతున్న వార్నర్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తోడయ్యాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేసి, డేవిడ్‌కు సహకారమందించాడు. ఇందులో 7 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది ఆసీస్.
అనంతరం ఛేదనలో శ్రీలంక తడబడింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. చివరకు 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌లో స్వర్ణమే నా లక్ష్యం: సుశీల్