ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం చాలా మంది ప్రముఖులు తమ ఆపన్న హస్తాన్ని అందజేస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్‌లిన్, షేన్ వార్న్ లాంటి వారు తమ వంతు సాయం అందించారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఆ దేశ మాజీ ఆటగాళ్లు షేన్ వార్న్, రికీ పాంటింగ్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ రోజున ఈ మ్యాచ్ జరగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మెల్బోర్న్ లేదా సిడ్నీల్లో ఈ మ్యాచ్ జరగనుంది.
వార్న్, పాంటింగ్‌తో పాటు గిల్‌క్రిస్ట్, జస్టిన్ లాంగర్, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్వెల్, మైఖేల్ క్లార్క్ ఈ ఆల్ టీ20 మ్యాచ్‌లో పాలుపంచుకోనున్నారు.
ఇప్పటికే షేన్ వార్న్.. తన గ్రీన్ క్యాప్‌ను వేలం వేసి అందులో వచ్చిన మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు(రూ.3.70 కోట్లు) బాధితులకు అందజేశాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, డీఆర్సీ షార్ట్ తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. బిగ్‌బాష్ లీగ్‌లో వాళ్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు 250 ఆస్ట్రేలియా డాలర్లు బాధితులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
-
Brilliant stuff @ShaneWarne @CommBank 👏🏼 pic.twitter.com/qyB43esUQV
— cricket.com.au (@cricketcomau) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Brilliant stuff @ShaneWarne @CommBank 👏🏼 pic.twitter.com/qyB43esUQV
— cricket.com.au (@cricketcomau) January 12, 2020Brilliant stuff @ShaneWarne @CommBank 👏🏼 pic.twitter.com/qyB43esUQV
— cricket.com.au (@cricketcomau) January 12, 2020
ఇదీ చదవండి: మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే