భవిష్యత్తు గురించి మనలో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఎవరిని వారు ప్రశ్నించుకొని ముందుకు సాగితే ఎలాంటి అభద్రతా భావం ఉండదు. ముఖ్యంగా టీనేజీ వయసులో పిల్లలు అభద్రతా భావానికి గురికాకుండా... ఆ వయసులో ఉన్నప్పుడు తను ఎలా ఆలోచించోవాడో తలుచుకుంటూ భవిష్యత్తు గురించి తనకు తాను భరోసానిస్తూ లేఖ రాసుకున్నాడు కోహ్లీ. అప్పటి విరాట్‌కు రాసిన ఆ స్వీయ సందేశాన్ని ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో పంచుకున్నాడు రన్‌మెషిన్.
-
My journey and life's lessons explained to a 15-year old me. Well, I tried my best writing this down. Do give it a read. 😊 #NoteToSelf pic.twitter.com/qwoEiknBvA
— Virat Kohli (@imVkohli) November 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">My journey and life's lessons explained to a 15-year old me. Well, I tried my best writing this down. Do give it a read. 😊 #NoteToSelf pic.twitter.com/qwoEiknBvA
— Virat Kohli (@imVkohli) November 5, 2019My journey and life's lessons explained to a 15-year old me. Well, I tried my best writing this down. Do give it a read. 😊 #NoteToSelf pic.twitter.com/qwoEiknBvA
— Virat Kohli (@imVkohli) November 5, 2019
విరాట్ స్వీయ సందేశం..
"హాయ్ చీకూ.. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు తెలుసు భవిష్యత్తు గురించి నిన్ను చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయని. ఎక్కువ సందేహాలను ఇప్పుడు నేను నివృత్తి చేయలేను అందుకు నన్ను క్షమించు. ఎందుకంటే ప్రతి సర్ప్రైజ్ బావుంటుంది.. ప్రతి సవాల్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.. నిరాశ చెందిన ప్రతిసారి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ రోజు ఇది నీకు అర్థం కాకపోవచ్చు. నీ గమ్యం కోసం వెళ్లే ప్రయాణంలో నీకే తెలుస్తుంది. ఆ మజిలీ ఎంతో అద్భుతంగా ఉంటుందని.
జీవితంలో ఎన్నో విషయాలను, జ్ఞాపకాలను దాచుకోవాలి.. అదే నీకు నేను చెబుతున్నా. నీ ప్రయాణంలో నీకొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. అందరిలా నువ్వూ విఫలమవుతావ్. తిరిగి ఎదిగేందుకు ప్రయత్నించడాన్ని మాత్రం మర్చిపోకు. ఒకసారి ఓడితే మళ్లీ మళ్లీ ప్రయత్నించు. భవిష్యత్తులో నిన్ను ఎంతో మంది ఇష్టపడతారు. కొంతమందికి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు. నీకు తెలియని వాళ్లు ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము!
నువ్వు అడిగిన షూస్ నాన్న కొనివ్వలేదని బాధపడుతున్నావని నాకు తెలుసు. అంతమాత్రాన ఆయన నిన్ను ప్రేమించట్లేదని కాదు. ఈ రోజు తప్పనిసరిగా ఆయన నిన్ను ప్రేమగా హత్తుకుంటాడు. నీ ఎత్తు గురించి మళ్లీ జోక్ చేస్తాడు. నీ విషయంలో కొన్ని సార్లు ఆయన కఠినంగా ఉండొచ్చు. నువ్వు అత్యుత్తమ స్థాయిలో ఉండాలనే ఆయన తాపత్రయం. తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకోవట్లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేది కుటుంబం మాత్రమే. కాబట్టి వారిని తిరిగి ప్రేమించు.. గౌరవించు.. వారితో కొంత సమయం గడుపు. నాన్నంటే నీకు ఎంతో ఇష్టమని ఆయనకు చెప్పు.
చివరగా ఒక్క విషయం.. నీ మనసు ఏది చెబితే అదే చెయ్. నీ కలల కోసం వేటాడు.. నీ కలలు ఎంత పెద్దవో ఈ ప్రపంచానికి చాటిచెప్పు. భవిష్యత్తులో విలాసవంత జీవితాన్ని గడపబోతున్నావ్.. కొంత పొదుపు చెయ్ మిత్రమా! ప్రతిరోజూ ఆనందంగా ఉండేలా చూసుకో !... విరాట్."
కోహ్లీ తనకు తాను రాసుకున్న ఈ సందేశం ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేసేలా ఉంది. అందరిని ప్రశ్నించే రీతిలో.. జీవితానికి భరోసానిచ్చే విధంగా విరాట్ స్వీయ సందేశం రాసుకున్నాడు.
ఇదీ చదవండి: టీమిండియాకు మెరుగైన సెలక్టర్లు కావాలి: యువీ