ETV Bharat / sports

బంగ్లాతో సిరీస్​లో కోహ్లీ ఈ రికార్డులు అందుకుంటాడా..?

గురువారం నుంచి ఆరంభం కానున్న రెండు టెస్టుల సిరీస్​లో విరాట్ కోహ్లీ.. అరుదైన మైలురాళ్లకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్​లో సత్తాచాటితే అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్​గా అవతరించనున్నాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ
author img

By

Published : Nov 14, 2019, 6:01 AM IST

ఇప్పటికే ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరికొన్ని ఘనతలకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్​తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్​లో విరాట్​.. బ్యాట్​ ఝుళిపిస్తే ఈ రికార్డులను అందుకునే అవకాశముంది.

టెస్టు సారథిగా రికార్డు..

టెస్టుల్లో విరాట్ ఇంకో 157 పరుగులు చేస్తే 5 రోజుల ఫార్మాట్​లో టీమిండియా సారథుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్​ సౌరభ్ గంగూలీ రికార్డును అధిగమిస్తాడు. గంగూలీ 113 మ్యాచ్​ల్లో 7,212 పరుగుల చేయగా.. కోహ్లీ 82 టెస్టుల్లోనే 7,066 పరుగులు చేసి దాదా తర్వాత ఉన్నాడు.

గంగూలీ రికార్డుకు చేరువలో..

దీర్ఘకాలిక ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో ప్రస్తుతం విరాట్ 7వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ తెందూల్కర్(15,921), రాహుల్ ద్రవిడ్(13,288), సునీల్ గావస్కర్(10,122), వీవీఎస్ లక్ష్మణ్(8,718), వీరేంద్ర సెహ్వాగ్(8,586), గంగూలీ (7,212)ఉన్నారు. వీరేకాకుండా క్రిస్ గేల్(8,214), స్టీఫెన్​ ఫ్లెమింగ్(7,172), గ్రెగ్ చాపెల్(7,110) రికార్డులనూ అందుకునే అవకాశముంది.

virat kohli will get a rare records..?
విరాట్ కోహ్లీ - గంగూలీ

అడుగు దూరంలో బోర్డర్ రికార్డు..

ఇంకో టెస్టులో విజయం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ రికార్డును బద్దలు కొడతాడు విరాట్. ఇప్పటివరకు 51 మ్యాచ్​లకు సారథ్యం వహించిన కోహ్లీ.. 31 విజయాలు అందించాడు. బోర్డర్.. 91 టెస్టుల్లో 32 మ్యాచ్​లను గెలిపించాడు. అత్యధిక విజయాలందుకున్న టెస్టు సారథిగా గ్రేమ్ స్మిత్(53) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం స్టీవ్ వా(51), క్లైవ్ లాయడ్(36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇండోర్​లో రెండోది..

గురువారం ఇండోర్ హోల్కర్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు అక్కడ ఒకే ఒక్కసారి టెస్టు మ్యాచ్ నిర్వహించారు. 2016లో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, పుజారా సెంచరీలు చేసి భారత్​ను 321తేడాతో గెలిపించారు.

ఈ ఏడాది టెస్టుల్లో శతకం చేయని విరాట్ కోహ్లీ.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో డబుల్ శతకం సాధించి పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్​తో జరగనున్న సిరీస్​లోనూ విరాట్ పరుగల ప్రవాహాన్ని పారించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: రోహిత్​శర్మ '264' మైలురాయికి ఐదేళ్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
1.++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 00:57  
STORYLINE:
Former Spain striker David Villa has announced he will retire at the end of the season in Japan.
The 37-year-old will lead a new US franchise, Queensboro FC, in New York as part of an investment group.
He will end his career playing for Vissel Kobe before moving back to America, where he previously represented New York FC.
He tweeted: "After 19 years as a professional, I have decided to retire from playing football at the end of this season.
"Thank you to all the teams, coaches and team-mates that have allowed me to enjoy this dreamed career. Thank you to my family, that has always been there to support me.
"It is my objective to put the cherry on top by winning the Emperor's Cup with visselkobe on January 1st.''
The ex-Barcelona player claimed 98 caps for Spain, scoring a record 59 goals, and won Euro 2008 and the World Cup in 2010.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.