మైదానంలో విభిన్నరీతిలో ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఆశ్చర్యపరుస్తుంటాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసినప్పుడు.. ధోనీ సిక్సర్ బాదినప్పుడు వైవిధ్యమైన హావభావాలు ప్రదర్శించడం చూశాం. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో శ్రేయస్ కొట్టిన సిక్సర్‌కు అదే విధంగా స్పందించాడు విరాట్. అయితే ఈ సారి శ్రేయస్ కూడా కోహ్లీని అనుసరించాడు.
ఇండోర్ మ్యాచులో శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ 16వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఫుల్లర్ లెంగ్త్‌గా సంధించిన ఆఖరి బంతిని.. చక్కని టైమింగ్‌తో శ్రేయస్ కళ్లు చెదిరే భారీ సిక్సర్(101 మీటర్లు) బాదేశాడు. లాంగాన్ మీదుగా మూడు అంతస్తుల ఎత్తులోంచి అది బౌండరీ దాటింది. ఆ షాట్‌ను చూసి కోహ్లీ ఓహ్.. ఉఫ్! అన్నట్టు తన భావాన్ని వ్యక్తీకరించాడు.
క్షణాల్లోనే తేరుకున్న శ్రేయస్ కూడా తన షాట్‌ను తానే నమ్మలేకపోయాడు. అచ్చం విరాట్ మాదిరిగానే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. వీరిద్దరి హావభావాలకు సంబంధించి చిత్రాలు ఇంటర్నెట్లో ఆలస్యంగా వైరల్ అయ్యాయి. లంకతో చివరి టీ20 శుక్రవారం పుణె వేదికగా జరగనుంది.
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని17.3 ఓవర్లలోనే ఛేదించింది. మూడో టీ20 పుణె వేదికగా ఈనెల 10న జరగనుంది.
-
Lovely Reactions after that Monstrous 101 m Six from Shreyas Iyer 😂😂😂😍😍😍❤❤❤ pic.twitter.com/o4c1pumvB9
— Genuine Cricket Fan (@Vijay__Kohli_18) January 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lovely Reactions after that Monstrous 101 m Six from Shreyas Iyer 😂😂😂😍😍😍❤❤❤ pic.twitter.com/o4c1pumvB9
— Genuine Cricket Fan (@Vijay__Kohli_18) January 7, 2020Lovely Reactions after that Monstrous 101 m Six from Shreyas Iyer 😂😂😂😍😍😍❤❤❤ pic.twitter.com/o4c1pumvB9
— Genuine Cricket Fan (@Vijay__Kohli_18) January 7, 2020
ఇదీ చదవండి: అండర్-19 ప్రపంచకప్‌లో ఒకే ఒక్క భారతీయుడు..!