ETV Bharat / sports

దాదా గురించి మీకు తెలియని విషయాలు..!

author img

By

Published : Oct 23, 2019, 12:27 PM IST

Updated : Oct 23, 2019, 3:24 PM IST

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ. టీమిండియా క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్​గా తనదైన ముద్రవేసిన దాదా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం!

దాదా గురించి మీకు తెలియని విషయాలు..!
దాదా గురించి మీకు తెలియని విషయాలు..!

భారత క్రికెట్​లో ఆటగాడిగా, కెప్టెన్​గా తనదైన ముద్ర వేశాడు రాయల్ బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ. బీసీసీఐ అధ్యక్షుడిగా నూతన అవతారమెత్తాడు. విజయవంతమైన క్రికెటర్​గా పేరుతెచ్చుకున్న ఇతడు.. బుధవారం నుంచి అత్యున్నత పదవి బాధ్యతలను స్వీకరించాడు. ఈ సందర్భంగా దాదా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

  • గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కలకత్తా' అనే బిరుదు ఇచ్చాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్. కానీ అంతకంటే ముందే దాదా తండ్రి అతడికి 'మహరాజ్' అనే ముద్దుపేరు పెట్టాడు.
  • 1992లో వెస్టిండీస్​పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ.. ఈ మ్యాచ్​లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగేళ్ల పాటు అతడికి ఉద్వాసన పలికింది యాజమాన్యం. ఆటగాళ్లకు డ్రింక్స్​ పట్టుకురావడాన్ని నిరాకరించడం వల్ల అతడి ప్రవర్తన బాగా లేదని జట్టు నుంచి తొలగించారనే పుకార్లూ ఉన్నాయి.
  • జట్టుకు దూరమైన సౌరవ్.. ఓ బౌలింగ్ వేసే యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటివద్దే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు.
  • నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ లార్డ్స్​ మైదానంలో టెస్టు అరంగేట్రం (1996) చేశాడు దాదా. అదే మ్యాచ్​లో సెంచరీ (131)తో అదరగొట్టాడు. కెరీర్​లో అక్కడ తొలి టెస్టు మ్యాచ్​ ఆడుతూ అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఇప్పటికీ గంగూలీదే రికార్డు.
  • 2003 ప్రపంచకప్​లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్​కప్ నాకౌట్​ మ్యాచ్​ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్​గా ఘనత సాధించాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్​లో 111 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
  • టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్​మన్​గా గంగూలీ పేరిటే రికార్డు ఉంది. రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు) కలిపి మొత్తం 18,433 పరుగులు చేశాడీ క్రికెటర్. (టెస్టుల్లో 7,212.. వన్డేల్లో 11,221)
  • అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్​మెన్​ రికార్డు గంగూలీ పేరిటే ఉంది. వన్డేల్లో 22, టెస్టుల్లో 16 చేశాడు.
  • గంగూలీ ఒకసారి (1996) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
  • వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్​లు పట్టిన ఐదుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకడు. సచిన్, సనత్ జయసూర్య, కలిస్, దిల్షాన్ అతడి కంటే ముందున్నారు.
  • గంగూలీ శతకం చేసిన ఏ టెస్టు మ్యాచ్​లోనూ భారత్ ఓడిపోలేదు.
  • మొదటి కుడి చేతి వాటం​ బ్యాట్స్​మన్​గా ఉన్న గంగూలీ.. సోదరుడి కిట్ వాడటం కోసం ఎడమచేతి వాటంకు మారాడు.
  • గంగూలీకి భక్తి ఎక్కువ. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం అలవాటు

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 23 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0457: Hong Kong Release 2 AP Clients Only 4236200
Suspect whose case led to HKG unrest released
AP-APTN-0448: Indonesia Cabinet AP Clients Only 4236199
Widodo announces new Indonesian cabinet
AP-APTN-0431: SKorea Corruption Court No Access South Korea 4236198
Wife of former SKO Justice Minister in court
AP-APTN-0401: Mexico Avocado Violence AP Clients Only 4236181
In Mexico, avocados bring income, cartels
AP-APTN-0348: Japan Nissan AP Clients Only 4236194
Nissan's new concept vehicles at Tokyo Motor Show
AP-APTN-0329: Japan Chinese VP AP Clients Only 4236193
Japan's Abe meets Chinese VP Weng Qishan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 23, 2019, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.