షకిబుల్ హసన్‌పై ఐసీసీ నిషేధం విధించింది. తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా టీమిండియాతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది బంగ్లా జట్టు. అయితే టీమిండియాపై టీ20 సిరీస్ గెలవడానికి ఇదే మంచి తరుణమని అంటున్నాడు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.
"భారత గడ్డపై టీమిండియాను ఓడించేందుకు బంగ్లాదేశ్ జట్టుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే వారి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పేస్ బౌలింగ్‌లో ముస్తఫిజుర్ రెహ్మన్‌పై ఎక్కువ ఒత్తిడి పడనుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ముస్తఫిజుర్ టాపార్డర్ వికెట్లు తీసి భారత జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మిడిలార్డర్లో టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది."
-వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు
కోహ్లీ గైర్హాజరుతో అందివచ్చిన అవకాశాన్ని యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు లక్ష్మణ్.
"భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల చాహల్, వాషింగ్టన్ సుందర్ ఈ పిచ్‌లపై కీ రోల్ పోషించనున్నారు. కృనాల్ పాండ్య లాంటి యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం."
-వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు
రోహిత్, రాహుల్, ధావన్‌లు టాపార్డర్‌లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు లక్ష్మణ్. అలాగే సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంటుందని తెలిపాడు.
ఇవీ చూడండి.. ద్రవిడ్‌ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం