ఇబదత్ హొస్సేన్.. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వికెట్ తీసి, మర్యాదపూర్వక సెల్యూట్‌తో అందరినీ ఆకర్షించాడు. డే/నైట్ టెస్టులో మొదటి రోజు పుజారాను ఔట్ చేసి, ఇదే రీతిలో సెండాఫ్ ఇచ్చాడు. ఈ బౌలర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ వాయుదళం(ఎయిర్‌ఫోర్స్)లో పనిచేస్తున్నాడట. క్రీడా కోటాలో అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాడట. ఈ విషయాన్నే అతడే స్వయంగా చెప్పాడు.
"నేను బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నా. వికెట్ తీసిన తర్వాత వేడుక చేసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయమని బంగ్లా ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ నాతో చెప్పాడు. ఇది నా బ్రాండ్‌గా మిగులిపోతుందని అన్నాడు. అప్పటి నుంచి వికెట్ తీసిన ప్రతిసారి ఇలా చేస్తున్నా" -ఇబదత్ హొస్సేన్, బంగ్లా బౌలర్.
క్రీడా విభాగంలో అతడికి వచ్చిన ఉద్యోగం.. క్రికెట్ నుంచి కాకుండా వాలీబాల్ తరఫున వచ్చిందట. ఇప్పటికీ ఎయిర్‌ఫోర్స్ జట్టు తరఫున వాలీబాల్ ఆడుతున్నాడు ఇబదత్. ఈ కారణంతోనే బంగ్లా క్రికెట్ జట్టులో ఎంపికైన ప్రతిసారి వాయదళం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటున్నాడు.
-
It takes a brilliant effort to dismiss #KingKohli! 👏
— Hotstar US (@Hotstarusa) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What an effort from Taijul Islam! 👌
🇮🇳 - 308/6 (80.3 overs)
📱 - https://t.co/U1rcWzMXgA#INDvBAN #PinkBallTest #PinkIsTheNewRed pic.twitter.com/jB5Vadm0lQ
">It takes a brilliant effort to dismiss #KingKohli! 👏
— Hotstar US (@Hotstarusa) November 23, 2019
What an effort from Taijul Islam! 👌
🇮🇳 - 308/6 (80.3 overs)
📱 - https://t.co/U1rcWzMXgA#INDvBAN #PinkBallTest #PinkIsTheNewRed pic.twitter.com/jB5Vadm0lQIt takes a brilliant effort to dismiss #KingKohli! 👏
— Hotstar US (@Hotstarusa) November 23, 2019
What an effort from Taijul Islam! 👌
🇮🇳 - 308/6 (80.3 overs)
📱 - https://t.co/U1rcWzMXgA#INDvBAN #PinkBallTest #PinkIsTheNewRed pic.twitter.com/jB5Vadm0lQ
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇబదత్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న తైజుల్ ఇస్లామ్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. అనంతరం 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది భారత్. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. 152 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లతో సత్తా చాటాడు.
ఇదీ చదవండి: వాట్లింగ్ డబుల్ సెంచరీ.. కివీస్ భారీ స్కోరు