క్రికెటర్లకు అభిమానులుండటం సహజమే. కానీ ఓ 87 ఏళ్ల వృద్ధురాలు ఆటగాళ్లకు మద్దతిస్తే ఎలా ఉంటుంది. యువకులతో సహా అదే ఉత్సాహంతో క్రికెటర్లకు ప్రేరణనిస్తే మైదానం ఎంత సందడిగా మారుతుందో చెప్పనక్కర్లేదు. ప్రపంచకప్‌లో టీమిండియాను ప్రోత్సహిస్తూ ఓ బామ్మ చేసిన హడావుడి మరిచిపోలేం. ఆమే చారులత పటేల్. తాజగా అనారోగ్యం కారణంగా ఈ అభిమాని మరణించింది.
ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లకు మద్దతిచ్చిన చారులత కోసం కోహ్లీ టికెట్లు కూడా పంపించాడు.
"ప్రియమైన చారులతజీ, మీరు మాపై చూపిస్తోన్న ప్రేమ, అమితమైన ఇష్టం మాకు ఎంతో ప్రేరణనిస్తున్నాయి. మీ కుటుంబంతో మా ఆటను చూసి ఆనందించండి."
-విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన కోహ్లీసేన రేపు జరగనున్న రెండో మ్యాచ్‌పై దృష్టిసారించింది.
ఇవీ చూడండి.. ప్రపంచ ఛాంపియన్ విండీస్‌పై ఐర్లాండ్ సంచలన విజయం