దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లా జట్టు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే సహా ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది రోహిత్ సేన. అయితే గురువారం జరగనున్న రెండో టీ20లో బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
" బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఇందులో ఎటుంటి మార్పులు అవసరం లేదని అనిపిస్తోంది. కానీ పిచ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తుది జట్టును ఎంపిక చేస్తాం".
-- రోహిత్‌శర్మ
-
One last look from the Captain before the 2nd T20I in Rajkot! What's your prediction? #TeamIndia #INDvBAN pic.twitter.com/OWoPmVG7pb
— BCCI (@BCCI) November 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">One last look from the Captain before the 2nd T20I in Rajkot! What's your prediction? #TeamIndia #INDvBAN pic.twitter.com/OWoPmVG7pb
— BCCI (@BCCI) November 6, 2019One last look from the Captain before the 2nd T20I in Rajkot! What's your prediction? #TeamIndia #INDvBAN pic.twitter.com/OWoPmVG7pb
— BCCI (@BCCI) November 6, 2019
లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దుల్ ఠాకుర్‌కు అవకాశం ఇవ్వనుంది యాజమాన్యం. పిచ్ పరిస్థితులు గమనించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు రోహిత్. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కన్నా రాజ్‌కోట్ మైదానం పిచ్ బాగుందని అన్నాడు హిట్‌మ్యాన్.
గురువారం నిర్వహించిన ప్రాక్టీసు సెషన్లో రోహిత్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ కనిపించారు. కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ సైతం నెట్స్‌లో సాధన చేశారు.
'మహా' అడ్డంకి..!
కాలుష్యం కమ్మేసిన దిల్లీలో భారత్-బంగ్లాదేశ్ తొలి టీ20 ముందు చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. అతి కష్టం మీద అక్కడ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండు జట్ల మధ్య రెండో టీ20కి కూడా వాతావరణ సమస్య తప్పేలా లేదు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజ్‌కోట్‌లో తుపాను సూచనలున్నాయి. గురువారం మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం గుజరాత్ అంతటా ‘మహా’ తుపాను ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మ్యాచ్ రోజు ఉదయం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. మరి రాత్రి 7 గంటలకు ఆట ఆరంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో.. మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. తొలి టీ20లో ఓడిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది.