ఈ మధ్య పర్యటక జట్లను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. గత పది సందర్భాల్లో భారత్‌లో పర్యటించిన జట్లు.. తమ రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయ్యాయి. ఇందులో తొమ్మిదిసార్లు 200 స్కోరు కూడా చేయలేకపోయాయి. కోహ్లీసేన ఆధిపత్యానికి ఇది నిదర్శనంగా కనబడుతోంది. కేవలం ఒకసారి 200 స్కోరును ఒక పర్యటక జట్టు అధిగమించింది.
ఇందులో ఎనిమిదిసార్లు ప్రత్యర్థి జట్టును భారత్ ఆలౌట్ చేయడం విశేషం. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి అలానే కనిపిస్తోంది.
ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. ఎదురీదుతోంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా ఈ రోజే చాప చుట్టేసేలా కనిపిస్తోంది.
ఇది చదవండి: హైలైట్స్ చూడను.. పబ్జీ ఆడతా: మయాంక్