క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.. ఇకపై ప్రజాపాలనకు సిద్ధమవనున్నారని సమాచారం. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్‌గా మురళీధరన్ బాధ్యతలు చేపట్టనున్నారని ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
గవర్నర్ పదవి చేపట్టాల్సిందిగా శ్రీలంక క్రికెట్ లెజెండ్‌ను ఆదేశ నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. వ్యక్తిగతంగా ఆహ్వానించారట. తమిళులు ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉండాలని రాజపక్స కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉత్తర ప్రావిన్స్‌కు మురళీధరన్ గవర్నర్ నియామితులైతే... తూర్పు ప్రావిన్స్‌కు అనురాధా యహంపత్, నార్త్ సెంట్రల్‌కు తిసా వితరాణా.. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ముత్తయ్య.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు(800) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 534 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2005 మార్చిలో చెన్నైకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా నూతన సెలక్టర్‌గా బెయిలీ నియామకం