వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా మహిళలు ఘనవిజయం సాధించారు. ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మృతికి దక్కగా.. స్టెఫానీ టేలర్ మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు కైవసం చేసుకుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సారథి స్టెఫానీ టేలర్ అర్ధశతకంతో (79) రాణించగా మిగతా అందరూ నిరాశపర్చారు. టీమిండియా బౌలర్లలో పూనమ్ యాదవ్, గోస్వామి చెరో రెండు వికెట్లు దక్కించుకోగా, దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే ఒక్కో వికెట్ సాధించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (74), రోడ్రిగ్స్ (69) అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా మొదటి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత పూనమ్ రౌత్ (24), మిథాలీ రాజ్ (20) నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
వెస్టిండీస్ బౌలర్లలో హెన్లే మాథ్యూస్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. ఫ్లెచర్ ఒక వికెట్ దక్కించుకుంది.
ఇవీ చూడండి.. సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నా: గిల్