వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో నెగ్గింది. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్ఉమన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్‌ల్లో 2,025 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. శిఖర్ ధావన్(48) స్మృతి కంటే ముందున్నాడు.
మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్ఉమెన్ బెలిండా క్లార్క్(45), మెగ్ లానింగ్(45) ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో 2వేల పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
![Smriti Mandhana 2nd fastest Indian to score 2000 ODI runs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/eitjsfoxkaam8ma_0711newsroom_1573112248_603.jpg)
విరాట్ కంటే వేగంగా..
51 ఇన్నింగ్స్‌ల్లో 43.05 సగటుతో 2,025 పరుగులు చేసింది స్మృతి. ఈ రికార్డుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(53), సౌరభ్ గంగూలీ(52), నవజ్యోత్ సిద్ధు(52)లను అధిగమించింది.
ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి అర్ధశతకంతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 63 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా 194 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత మహిళా జట్టు.
ఇదీ చదవండి: ఆఖరి వన్డే టీమిండియాదే.. సిరీస్ కైవసం