దశాబ్దం తర్వాత పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్ ఆడనుంది శ్రీలంక. ఈ నేపథ్యంలో 2009 లాహోర్ ఉగ్రదాడిని గుర్తుచేసుకున్నారు ఐసీసీ మాజీ అంపైర్ సైమన్ టాఫెల్. ఆ ఘటన ఇప్పటికీ తన కళ్ల ముందు మెదలాడుతూనే ఉందని తన పుస్తకం 'ఫైండింగ్ ద గ్యాప్స్'లో ప్రస్తావించారు.
"ఆ రోజు నుంచి ఇప్పటివరకు పెద్ద ధ్వనులు విన్న ప్రతిసారీ ఆందోళనగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. తుపాకీ లేదా అలాంటి సౌండ్లు విన్నప్పుడు ఈ రోజుకూ అసౌకర్యంగా ఉంటుంది. ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి." -సైమన్ టాఫెల్.
ఆ సిరీస్‌లో అంపైర్లుగా వ్యవహరించిన నలుగురిలో టాఫెల్ ఒకరు. ఉగ్రదాడిలో శ్రీలంక ఆటగాళ్లు సంగక్కర, మెండిస్, సమరవీర గాయపడ్డారు.
పదేళ్లు తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టుతో టెస్టు సిరీస్ ఆడబోతుంది శ్రీలంక. వచ్చే నెల 11 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు రావల్పిండి వేదికగా జరగనుంది. మూడు రోజుల ముందుగానే లంక జట్టు పాకిస్థాన్‌కు బయలదేరనుంది.
శ్రీలంక టెస్టు జట్టు:
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మ్యాథ్యూస్, దినేశ్ చండిమల్, కుశాల్ పెరీరా, లాహిరు తిరిమన్నె, ధనంజయ డిసిల్వా, డిక్వెల్లా, దిలుర్వాన్ పెరీరా, లసిత్ ఎంబుల్డెనియా, సురంగ లక్మల్, లాహిరు కుమారా, విశ్వా ఫెర్నాండో, కసున్ రజిత, లక్షన్ సండకన్.
ఇదీ చదవండి: వైరల్: లగాన్ షాటేనా.. కాదు.. శివసేన స్కూప్ షాట్!