శివమ్ దూబే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైన ముంబయి క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ హార్డ్ హిట్టర్, రైట్ ఆర్మ్ మీడియం పేసర్. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ఇతడికి అవకాశమిచ్చారు సెలక్టర్లు. ఈ ఆటగాడి గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అందుకు కారణం బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియో.
-
20 seconds of Shivam Dube 💥💥🚀🚀 #TeamIndia 💪🏻💪🏻 #INDvBAN @Paytm pic.twitter.com/yWiVUpDQ8f
— BCCI (@BCCI) November 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">20 seconds of Shivam Dube 💥💥🚀🚀 #TeamIndia 💪🏻💪🏻 #INDvBAN @Paytm pic.twitter.com/yWiVUpDQ8f
— BCCI (@BCCI) November 2, 201920 seconds of Shivam Dube 💥💥🚀🚀 #TeamIndia 💪🏻💪🏻 #INDvBAN @Paytm pic.twitter.com/yWiVUpDQ8f
— BCCI (@BCCI) November 2, 2019
బంగ్లాదేశ్‌తో తొలి టీ20 నేడు దిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. దూబే కూడా నెట్స్‌లో కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు ఆడిన షాట్లను ఓ 20 సెకన్ల వీడియోగా రూపొందించి.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది బీసీసీఐ. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. దూబే ఆట మరో యువరాజ్‌లా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఇతడికీ యువీకి కొంచెం ఆటలో పోలికలు ఉన్నాయి.
యువీలాగే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన దూబే... ఆరడుగుల ఎత్తు ఉంటాడు. గతంలో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా... ఈ యువ క్రికెటర్ ఓ టెస్టు మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు.
ఇవీ చూడండి.. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ విజేతగా నెదర్లాండ్