దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి తిరిగి టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలనుకున్న ధావన్‌కు మొదటి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో భాగంగా దిల్లీ జట్టుకు ఆడిన ధావన్ జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ .. దిల్లీపై ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టులో నితీశ్ రానా (55, 30 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. ధావన్ డకౌట్ అయ్యాడు. మిగతా వారు అంతగా ఆకట్టుకోలేకపోయిందున దిల్లీ 165 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన జమ్ము కశ్మీర్ జట్టు ఓపెనర్లు వధవాన్ (48), ఖజురియా (49) విజృంభించడం వల్ల 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ టోర్నీలో దిల్లీ జట్టుకు ఇది తొలి ఓటమి కాగా.. జమ్ము కశ్మీర్‌కు తొలి విజయం కావడం విశేషం.
ఇవీ చూడండి.. 'విరామ సమయంలో హ్యాట్రిక్ గురించే ఆలోచించా'