భారత క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరాటానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్ వేదికగా గురువారం రెండో టీ20 ఆడనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఇందులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. అతడు లేని లోటు తొలి టీ20లో స్పష్టంగా కనిపించింది. భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలిసారి ఈ ఫార్మాట్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయారు.
మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా ఎలాగైనా సరే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌శర్మ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేయనున్నాడు.
గుజరాత్‌లో ప్రస్తుతం 'మహా' తుపాను ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మ్యాచ్ రోజు ఉదయం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. మరి రాత్రి 7 గంటలకు ఆట ఆరంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, రిషభ్ పంత్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే, కృనాల్ పాండ్య, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్
బంగ్లాదేశ్: ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), షైఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్, అల్ అమీన్ హుస్సేన్, లిట్టన్ దాస్, మొసద్దీక్ హుస్సేన్, ముస్తాఫీజుర్ రెహ్మాన్, అఫిఫ్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం, మహ్మద్ నయీమ్
ఇది చదవండి: బంగ్లాను ఓడించేందుకు పక్కా ప్లాన్‌తో వస్తాం: రోహిత్‌శర్మ