ఓ అంగుళం క్రీజు దాటి బౌలింగ్ చేస్తేనే అది నోబాల్ అని అందరికి తెలుసు.. అలాంటిది దాదాపు అడుగు దూరం వరకు క్రీజు దాటి బౌలింగ్ చేశాడు ఓ ఆటగాడు. అంతేకాదు అతడు వేసిన ఓ వైడ్‌ను కీపర్ డైవ్ చేసి మరీ పట్టుకున్నాడు. ఇటీవల ప్రారంభమైన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ బౌలర్ ఈ విధంగా బౌలింగ్ చేసి నవ్వు తెప్పించడమే కాదు.. అనుమానాలకూ తావిచ్చాడు.
-
And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019
చట్టాగ్రామ్ ఛాలెంజెర్స్తో జరిగిన మ్యాచ్‌లో సిలెట్ థండర్ బౌలర్ క్రిష్‌మర్ సంతోకి ఈ విధంగా బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. అతడి ప్రదర్శన చూసి 'ఈ రకంగా కూడా బౌలింగ్ వేస్తారా' అని నెటిజన్లు సందేహిస్తున్నారు. కాగా.. 'అనుమానాస్పద బౌలింగ్' అని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అతడు వేసిన బంతి.. టెస్టుల్లో కూడా వైడ్ ఇచ్చేంతలా ఉంది.
ఈ అంశంపై విచారణకు ఆదేశించామని సిలెట్ థండర్ జట్టు డైరెక్టర్ తంజిల్ చౌదురి తెలిపాడు. సంతోకి స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడా? లేదా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో సిలెట్ థండర్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఓవర్ మిగిలుండగానే పూర్తి చేసింది చట్టాగ్రామ్ ఛాలెంజర్స్. సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అందులో ఓ నోబాల్‌తో పాటు 4 వైడ్లు వేశాడు.
ఇదీ చదవండి: వైరల్: 4.5 సెకండ్లలోనే బాస్కెట్లో బంతి..!