రాజస్థాన్ రంజీ క్రికెటర్ వినీత్ సక్సేనా.. తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. రాజస్థాన్ తరఫున 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా ఇతడు ఘనత సాధించాడు. 2011-12 సీజన్లో ఇతడు చేసిన డబుల్ సెంచరీతోనే ఆ రాష్ట్రానికి రంజీ ట్రోఫీ వచ్చింది.
39 ఏళ్ల వినీత్ సక్సేనా.. 1998-99 సీజన్లో బంగాల్పై తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. 2018-19 సీజన్లో ఉత్తరాఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో విదర్భతో జరిగిన మ్యాచ్ ఇతడికి చివరిది.
మొత్తం కెరీర్లో ఉత్తరాఖండ్, రాజస్థాన్, రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన సక్సేనా.. 129 మ్యాచ్‌ల్లో 7,637 పరుగులు చేశాడు. ఇందులో ఓ ద్విశతకం, 17 సెంచరీలు, 38 అర్ధశతకాలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 36.89గా ఉంది.
2011-12 సీజన్లో తమిళనాడుతో ఫైనల్లో చేసిన డబుల్ సెంచరీ, వినీత్ కెరీర్లో మరపురాని ఇన్నింగ్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో 257 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ (904 నిమిషాలు) ఆడి రాజస్థాన్‌కు రంజీ ట్రోఫీని అందించాడు.
ఇవీ చూడండి.. ఆటకు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్