గతంలో వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్, టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ల బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరించాడు. డే/నైట్ టెస్టు కోసం గులాబి బంతితో ప్రాక్టీస్ చేస్తూ.. లంక మాజీ క్రికెటర్ శైలిలో బౌలింగ్ చేశాడు అశ్విన్.
-
Interesting!! @ashwinravi99 emulating Sanath Jayasuriya's bowling action in Indore with the pink ball #pinkballTest #Cricket #INDvBAN pic.twitter.com/dUXAJVebyh
— Rohit Juglan रोहित जुगलान روہت جگلان۔ (@rohitjuglan) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Interesting!! @ashwinravi99 emulating Sanath Jayasuriya's bowling action in Indore with the pink ball #pinkballTest #Cricket #INDvBAN pic.twitter.com/dUXAJVebyh
— Rohit Juglan रोहित जुगलान روہت جگلان۔ (@rohitjuglan) November 17, 2019Interesting!! @ashwinravi99 emulating Sanath Jayasuriya's bowling action in Indore with the pink ball #pinkballTest #Cricket #INDvBAN pic.twitter.com/dUXAJVebyh
— Rohit Juglan रोहित जुगलान روہت جگلان۔ (@rohitjuglan) November 17, 2019
టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా చెమటలు చిందిస్తున్నారు. ఇందులో భాగంగా రవిచంద్రన్ అశ్విన్.. లంక దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఇటీవలే ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై, ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఇప్పుడు నిర్ణయాత్మక రెండో టెస్టు నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22న మ్యాచ్ ప్రారంభం కానుంది. డే/నైట్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టెస్టులో తొలిసారి గులాబి బంతితో ఆడనుంది టీమిండియా.
ఇదీ చదవండి: విరాట్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం: అక్తర్