ముంబయి వేదికగా జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ పృథ్వీషా మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ (174 బంతుల్లో)తో అదరగొట్టాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా ద్విశతకం చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఫృథ్వీషా కన్నా ముందు ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి (123 బంతులు), రాజేశ్ బోరా (156) ఉన్నారు.
షా.. 202 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ముంబయి 409/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బరోడా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బరోడా 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 431 పరుగులు చేయగా.. బరోడా 307 పరుగులకే ఆలౌటైంది.
దాదాపు 8 నెలల నిషేధం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన పృథ్వీషా.. ఇటీవలే 'సయ్యద్ ముస్తాక్ అలీ'లో అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు చేశాడు.