టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు చాలా ఎక్కువ. ఇంతకు ముందు అతడిపై అభిమానాన్ని చాటుతూ ఓ పాకిస్థానీయుడు.. భారత జాతీయ పతాకాన్ని ఎగరేసిన ఘటన చూశాం. ఈ రకంగా వినూత్న రీతిలో కోహ్లీ కోసం పరితపిస్తున్న వారు చాలామంది. తాజాగా ఓ వ్యక్తి ఒంటిపై విరాట్ బొమ్మను పచ్చబొట్టు పొడిపించుకొన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 16 పచ్చబొట్లు వేయించుకున్నాడు.
ఒడిశాలోని కటక్‌కు చెందిన పింటూ బెహరాకు విరాట్ కోహ్లీ అంటే విపరీతమైన ఇష్టం. అతడిపై అభిమానాన్ని చాటుతూ.. ఒంటిపై వివిధ ప్రదేశాల్లో కోహ్లీ పేరు, జెర్సీ నెంబర్ 18తో సహా 16 పచ్చబొట్లు పొడిపించుకున్నాడు.
"నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని కావాలనుకుంటున్నా. నాకు అతడి ఆట తీరంటే ఎంతో ఇష్టం. అందుకే అతడిపై నా గౌరవాన్ని ఈ విధంగా చాటుకుంటున్నా" -పింటూ బెహరా, విరాట్ అభిమాని
కటక్‌లో నేడు(ఆదివారం) వెస్టిండీస్‌తో భారత్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో విండీస్, రెండో దానిలో కోహ్లీసేన విజయం సాధించింది. ఆఖరి పోరులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
ఇదీ చదవండి: ఓ మ్యాచ్ గెలిస్తే మేరీతో నిఖత్ ఢీ