ETV Bharat / sports

గులాబి గుట్టేంటి? - పింక్ బంతితో మేకింగ్

మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్​తో​ పింక్ టెస్టు ఆరంభం కానుంది. అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డే అండ్ నైట్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్​లో ఇరు జట్లు తొలిసారి గులాబి బంతితో ఆడనున్నాయి. ఈ  సందర్భంగా గులాబి బంతిపై ఓ లుక్కేద్దాం!

గులాబి బంతి
author img

By

Published : Nov 20, 2019, 7:42 AM IST

గులాబి.. గులాబి.. గులాబి..! ఇప్పుడు భారత క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ! వన్డేలు, టీ20లంటే తెలుపు బంతి.. టెస్టులంటే ఎరుపు బంతి.. ఎన్నో ఏళ్లుగా అలవాటైపోయిన విషయమిది! కానీ ఇప్పుడు భారత్‌ ఆడబోయే తొలి డే/నైట్‌ టెస్టులో గులాబి బంతి వినియోగిస్తారనేసరికి.. ‘ఎందుకలా?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ రంగే ఎందుకు? తెలుపు, ఎరుపు బంతులతో పోలిస్తే అందులో కొత్తదనమేంటి? అదెలా స్పందిస్తుంది? క్రికెటర్లు దానికి ఎలా అలవాటు పడతారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ గులాబి బంతిని ఎలా తయారు చేస్తారు? దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.

చేతి మహిమ

భారత్‌లో ఆడే టెస్టు మ్యాచ్‌లకు ఎస్జీ సంస్థ బంతులనే ఉపయోగిస్తారు. విదేశాల్లో ఎక్కువగా కూకాబుర్రా బంతులు వినియోగంలో ఉన్నాయి. వాటిని పూర్తిగా యంత్రాలతో తయారు చేస్తారు. కానీ ఎస్జీ బంతులకు అక్కడక్కడా కొద్దిగానే యంత్రాల వినియోగం ఉంటుంది. కార్క్‌, ఉన్ని కలిసిన మిశ్రమంతో బంతి అంతర్భాగాన్ని తయారు చేయడం.. తోలు కత్తిరించడం.. బంతిని దారంతో కుట్టడం అన్నీ మనుషులే చేస్తారు. సీమ్‌ దారాన్ని చేత్తో కుట్టడం వల్ల స్పిన్నర్లకు బంతి మీద బాగా పట్టు చిక్కి తిప్పడానికి, బౌన్స్‌ రాబట్టడానికి అవకాశముంటుంది. అంతేకాక సీమ్‌ ఎక్కువ సమయం (దాదాపు 45-50 ఓవర్లు) నిలిచి ఉంటుంది.

PINKBALL
గులాబి బంతి తయారు చేస్తారు ఇలా..

సీమ్‌లో ఏముంది

ఎరుపు బంతితో పోలిస్తే గులాబిలో సీమ్‌ పరంగా వైవిధ్యం ఉంటుంది. ఎరుపు బంతిలో పూర్తిగా సింథటిక్‌ దారాన్ని వాడతారు. గులాబీలో సింథటిక్‌తో పాటు లెనిన్‌ దారం ఉపయోగిస్తారు. ఇందుకు కారణం ఉంది. ఎరుపు బంతితో పగటి పూట మాత్రమే ఆట సాగుతుంది కాబట్టి సింథటిక్‌ దారంతో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ గులాబి బంతితో సగం ఆట రాత్రి పూట సాగుతుంది కాబట్టి.. మంచు ప్రభావం ఉన్నపుడు సింథటిక్‌ దారంతో ఉన్న సీమ్‌ వల్ల బంతిపై పట్టు చిక్కదు. అందులో లెనిన్‌ దారం తడిని పీల్చుకోవడం వల్ల బౌలర్లకు ఇబ్బంది ఉండదు. ఇక ఎరుపు బంతిలో సీమ్‌ దారం తెలుపు రంగుతో ఉంటుంది. గులాబీపై అది వేస్తే సరిగా కనిపించడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. వేరే రంగులు కొన్ని ప్రయత్నించి.. చివరికి నలుపు రంగు దారాన్ని ఖరారు చేశారు. సీమ్‌ మన్నికపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అది కాస్త దళసరిగా ఉండేట్లు చూస్తున్నారు. కాబట్టి బౌలర్లు దీన్ని ఉపయోగించుకుని స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది.

PINKBALL
గులాబి బంతి తయారు చేస్తారు ఇలా..

బౌలర్లకు పండగే

గులాబి బంతి ఎక్కువ స్వింగ్‌ అవడానికి.. దానికి వేసే పీయూ కోట్‌ ఓ ముఖ్య కారణం. ఎరుపు బంతిలో లెదర్‌ మీద మైనం పూస్తారు. ఆట సాగే కొద్దీ దాన్ని బంతి ఇముడ్చుకుంటుంది. బంతి రంగు కొంచెం మారుతుంది. ఆ సమయంలోనే బౌలర్లు బంతిని ఒక వైపు బాగా రుద్ది.. రివర్స్‌ స్వింగ్‌కు ప్రయత్నిస్తారు. అయితే గులాబి బంతి మీద మైనం పూస్తే కొన్ని ఓవర్ల తర్వాత బంతి నలుపు రంగులోకి మారి బ్యాట్స్‌మెన్‌కు సరిగా కనిపించట్లేదని తేలింది. అందువల్ల దీనిపై మైనం బదులు పీయూ కోట్‌ అనే పాలిష్‌ రంగును వేస్తున్నారు. దీని వల్ల కనీసం 40 ఓవర్ల పాటు బంతి రంగు మారదు. బంతి మీద అదనపు లేయర్‌లా ఉండే ఈ పాలిష్‌ వల్ల బంతి మరింతగా స్వింగ్‌ అవడమే కాక.. వేగమూ పెరుగుతుంది.

PINKBALL
గులాబి బంతి తయారు చేస్తారు ఇలా..

ఈ రంగే ఎందుకు..

డే/నైట్‌ టెస్టుకు గులాబి బంతినే వినియోగించడానికి కొన్ని కారణాలున్నాయి. పగటి పూట నిర్వహించే టెస్టుల్లో వినియోగించే ఎరుపు బంతి మన్నిక ఎక్కువ. అయితే 20-30 ఓవర్ల తర్వాత దాని రంగు పోయి నల్లగా అవుతుంది. డేనైట్‌ టెస్టుల్లో ఆ బంతిని ఉపయోగిస్తే రాత్రి కనిపించే అవకాశముండదు. దీంతో ప్రత్యామ్నాయంగా పసుపు, నారింజ రంగులు ప్రయత్నించి చూశారు. వాటితో ఇబ్బందులు తలెత్తాయి. అనేక ప్రయోగాల తర్వాత బ్యాట్స్‌మెన్‌కు సరిగ్గా కనిపించే ప్రత్యామ్నాయ రంగు గులాబినే అని దానినే ఖరారు చేశారు.

15 శాతం ఎక్కువ..!

సీమ్‌లో మార్పు వల్ల కావచ్చు.. గులాబి రంగు నిలిచి ఉండేందుకు వేసే కోటింగ్‌ వల్ల కావచ్చు.. ఈ బంతి ఎక్కువ స్వింగ్‌ అవుతుంది. బౌలర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. గులాబి బంతి వల్ల బౌలర్లకు ఉండే అదనపు ప్రయోజనం 10 నుంచి 15 శాతం దాకా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ బంతి మిగతా వాటి కంటే బాగా స్వింగ్‌ కావడమే కాదు.. దీని వేగమూ ఎక్కువే. మ్యాచ్‌లో తమను దాటి వేగంగా వెళ్లిపోయే గులాబి బంతుల్ని చూసి బ్యాట్స్‌మెన్‌ ఆశ్చర్యపోయే దృశ్యాలు కనిపించొచ్చు. అలాగే స్వింగ్‌ కూడా వాళ్లను బెంబేలెత్తించవచ్చు. ముఖ్యంగా గులాబి బంతిని బ్యాట్స్‌మెన్‌ గుర్తించేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వాళ్లకు ఇది కొత్తగా అనిపించి అలవాటు పడే వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణాలతోనే ఇప్పటిదాకా విదేశాల్లో జరిగిన గులాబి టెస్టుల్లో బౌలర్ల ఆధిపత్యమే సాగింది. అయితే భారత్‌లో దులీప్‌ ట్రోఫీలో వాడిన గులాబి బంతుల నాణ్యత సరిగా లేకపోవడం వల్ల త్వరగా సీమ్‌, మెరుపు పోయి బ్యాట్స్‌మెన్‌ జోరు చూపించారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం కొన్ని మార్పులతో మరింత మన్నికగా బంతులు తయారు చేసినట్లు ఎస్జీ సంస్థ చెబుతున్న నేపథ్యంలో ఈడెన్‌లో గులాబి బంతి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

PINKBALL
గులాబి బంతి తయారు చేస్తారు ఇలా..

లోపలంతా ఒకటే..

తెలుపు, ఎరుపు బంతులతో పోలిస్తే గులాబి బంతి లోపలి పదార్థంలో తేడా ఏమీ ఉండదు. వాటిలో మాదిరే ఉన్ని, కార్క్‌ల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. దాని మీద తోలు అంటిస్తారు.

"ఆటగాళ్లు 80 ఓవర్ల పాటు బంతిని చూడగలగాలి. కాబట్టి పిచ్‌పై గడ్డి అవసరం. కానీ అది పచ్చని గడ్డే కానవసరం లేదు. 6-8 మిల్లీమీటర్ల పొడవు గడ్డి ఉంటే చాలు. అంతకంటే ఎక్కువుంటే పిచ్‌ విపరీతంగా సేస్‌కు సహకరిస్తుంది"
- దల్జీత్‌ సింగ్‌, బీసీసీఐ మాజీ చీఫ్‌ క్యురేటర్‌

ఇదీ చదవండి: ట్యాంపరింగ్​ ఒకటే అయినా బోర్డు శిక్షలు వేరే...!

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Wednesday 20th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: File of Mauricio Pochettino who was sacked as Tottenham Hotspur manager. Already moved.
SOCCER: File of Jose Mourinho, Rafael Benitez and Carlo Ancelotti who have been linked with the vacant manager's position at Tottenham Hotspur. Already moved.
SOCCER: File of previous Mauricio Pochettino soundbites which hinted that his time at Tottenham Hotspur was coming to an end. Already moved.
SOCCER: Mauricio Pochettino's sacking was "a big shock", says Tottenham Hotspur defender Ben Davies. Already moved.
SOCCER: Former Atletico Madrid, Barcelona and Spain striker David Villa talks to SNTV. Already moved.
SOCCER: Post-match reaction following Germany's 6-1 Euro 2020 Group C qualifier win over Northern Ireland. Already moved.
SOCCER: Post-match reaction following Wales' 2-0 victory over Hungary which secured their place at Euro 2020. Already moved.
TENNIS: Further highlights and reaction from the finals of the Davis Cup in Madrid, Spain:
-  Spain 2-1 Russia. Expect at 0200.
-  Australia 3-0 Colombia. Already moved.
-  USA 0-3 Canada. Already moved.
BOXING: Deontay Wilder and Luis Ortiz make their grand arrivals in Las Vegas ahead of their 23rd November heavyweight title bout at MGM Grand Garden Arena. Already moved.
BASKETBALL: Highlights from round nine of the Euroleague:
- Bayern Munich v Olympiacos. Already moved.
- Milano v Maccabi Tel Aviv. Already moved.
- ASVEL v Anadolu Efes. Already moved.
- Real Madrid v Khimki Moscow. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.