ETV Bharat / sports

ఆ ఒక్క బౌలర్​ 200 పరుగులు సమర్పించుకున్నాడు

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్థాన్​ బౌలర్ యాసిర్​ షా...​ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో 48.4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. 205 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఆ ఒక్క బౌలర్​ 200 పరుగులు స్కోరిచ్చాడు...!
author img

By

Published : Nov 24, 2019, 6:39 AM IST

పాకిస్థాన్​ బౌలర్ యాసిర్​ షా...​ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియా​తో జరుగుతోన్న తొలి టెస్టులో 4 వికెట్లు తీసి.. 205 పరుగులు సమర్పించుకున్నాడు. 33 ఏళ్ల ఈ క్రికెటర్​ ఒక టెస్టు ఇన్నింగ్స్​లో 200 పరుగులు పైగా ఇచ్చిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతడు ఇంత భారీ స్కోరు ఇవ్వడం ఇది మూడోసారి.

గతంలో...

యాసిర్​.. గతంలోనూ భారీగానే పరుగులు ఇచ్చుకున్నాడు. మెల్​బోర్న్​ వేదికగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టులో 41 ఓవర్లు వేసి 207 రన్స్​ ఇచ్చాడు. ఆ మ్యాచ్​లో మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2016లో ఓల్డ్​ ట్రాఫోర్డ్​ మైదానంలో ఇంగ్లాండ్​తో జరిగిన ఓ మ్యాచ్​లో.. 54 ఓవర్లు వేసి 213 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్​లో కేవలం ఒక్క వికెట్​ తీశాడు.

ఓటమి దిశగా పాక్​...

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్​ ఓటమి దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 580 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్​ 240 రన్స్​కే ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్​లో​ ఫాలోఆన్ ఆడిన పాక్​ 17 ఓవర్లలో 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బాబర్​ అజామ్​(20), షాన్​ మసూద్​(27) క్రీజులో ఉన్నారు. ఇంకా 276 పరుగులు వెనుకంజలో ఉంది పాక్.

ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో ​ ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (154; 296 బంతుల్లో 10ఫోర్లు) అద్భుత శతకం సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్‌(185; 279 బంతుల్లో 6ఫోర్లు) రాణించాడు. వీరిద్దరికీ తోడు జో బర్న్స్​(97), మాథ్యూ వేడ్​(60) ధాటికి 580 పరుగులు చేసి ఆలౌట్​ అయింది కంగారూ జట్టు.

స్మిత్​ను ఏడుసార్లు​...

ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ లెగ్​ స్పిన్నర్​ యాసిర్​ షా 205 పరుగులు ఇచ్చుకుని... జో బర్న్స్​, స్టీవ్​ స్మిత్​, మిచెల్​ స్టార్క్​, హజిల్​వుడ్​ వికెట్లు తీశాడు. ఆసీస్​-పాక్​ తలపడిన ఆరు మ్యాచ్​ల్లో ఈ ఆటగాడు బరిలోకి దిగి.. కంగారూ జట్టు ఆటగాడు స్మిత్​ను ఏడు సార్లు ఔట్​ చేయడం విశేషం.

Yasir Shah bags an embarassing record in Brisbane Test despite taking four wickets
యాసిర్​ షా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.