వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌గేల్.. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భద్రత విషయంలో ఆ దేశం అత్యంత సురక్షితమైనదని అన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న ఈ కరీబియన్ ఆటగాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు.
"ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్థాన్ అతి సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటి. క్రికెటర్లకు ప్రెసిడెంట్ స్థాయిలో భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. అంటే మనం సురక్షితమైన చేతుల్లో ఉన్నట్లే"
-గేల్, వెస్టిండీస్ క్రికెటర్
దశాబ్ద కాలం తర్వాత శ్రీలంక.. పాక్‌లో పర్యటించి అక్కడ టెస్టు సిరీస్ ఆడింది. ఆ సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఎహ్సాన్ మణి మాట్లాడుతూ పాక్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని అన్నాడు.
-
Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu
— Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu
— Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu
— Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020
లంక పర్యటనను విజయవంతం చేసిన పీసీబీ, బంగ్లాదేశ్‌ను తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. టీ20లతో పాటు టెస్టులూ ఆడాలని కోరింది. కానీ టెస్టులు ఆడేందుకు బంగ్లా బోర్డు విముఖత వ్యక్తం చేసింది.
ఇవీ చూడండి.. గంగూలీని ట్రోల్ చేసిన సచిన్.. నెట్టింట వైరల్