భారత్‌తో వన్డే సిరీస్ ముంగిట న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇతడి బదులుగా టామ్ లేథమ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించింది న్యూజిలాండ్ బోర్డు.
టీమిండియాతో జరిగిన మూడో టీ20లో విలియమ్సన్ ఎడమ భుజానికి గాయమైంది. తీవ్రత పెద్దగా లేకున్నా కాస్త విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించినట్లు సమాచారం. ఇతడి స్థానంలో బ్యాట్స్‌మన్ మార్క్ ఛాప్మన్ రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. కేన్ దూరమవడం వల్ల రెండు టీ20లకు టిమ్ సౌథీ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.
"ప్రస్తుతం కేన్ భుజం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే కాస్త విశ్రాంతి అవసరం. వారం రోజులూ ఫిట్నెస్ సెషన్లలో పాల్గొంటాడు. శుక్రవారం బ్యాటింగ్ ఆడతాడు. వచ్చే మంగళవారం జరగనున్న మూడో వన్డే నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాడు"
-- విజయ్ వల్లభ్, న్యూజిలాండ్ జట్టు ఫిజియో
న్యూజిలాండ్‌పై 5 టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది కోహ్లీసేన. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం జరగనుంది.
న్యూజిలాండ్ జట్టు...
మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్, రాస్ టేలర్, టామ్ లేథమ్ (కీపర్/కెప్టెన్), మార్క్ ఛాప్మన్, జేమ్స్ నీషమ్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, హమీష్ బెన్నెట్, ఇష్ సోథీ, టామ్ బ్లండెల్, కేల్ జేమిసన్, స్కాట్ కగ్గిలిన్.
భారత జట్టు..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత స్టార్ ఓపెనర్ రోహిత్‌శర్మ దూరమయ్యాడు. కివీస్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20లో హిట్‌మ్యాన్ కాలిపిక్క గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల హిట్‌మ్యాన్ ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఈ స్టార్ క్రికెటర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు లభించింది. మరో స్టార్ క్రికెటర్ ధావన్ స్థానంలో పృథ్వీషాకు చోటు దక్కింది.
>> కేఎల్ రాహుల్(కీపర్), మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ, మహ్మద్ షమి, యజువేంద్ర చాహల్, పృథ్వీ షా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్