వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం జరిగిన క్వాలిఫై పోటీలు ముగిశాయి. నెదర్లాండ్-పపువా న్యూగునియా మధ్య జరిగిన ఫైనల్లో డచ్ టీమ్ ఘనవిజయం సాధించింది. ఫలితంగా టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టైటిల్ కైవసం చేసుకుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూగునియా నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. లెగ సైకా (39), సేసె బౌ (29), జాసన్ కిలా (27) ఫర్వాలేదనిపించారు. డచ్ బౌలర్లలో బ్రెండన్ గ్లోవర్ మూడు, వాన్ డర్ మెర్వ్, వాన్ డర్ గుటెన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్ కూపర్ (41), ర్యాన్ టెన్ (34) ఆకట్టుకున్నారు. బ్రెండన్ గ్లోవర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
ఇప్పటికే నెదర్లాండ్, న్యూగునియాతో పాటు ఒమన్, స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్నాయి.
ఇవీ చూడండి.. 19 ఏళ్లకే రోహిత్, శిఖర్‌ల వికెట్