మహేంద్రసింగ్ ధోనీ పేరు వినపడితే చాలు.. ఎక్కడ చూసిన ఒక్కటే ప్రశ్న.. రిటైర్మెంట్ ఎప్పుడు? తాజాగా ఈ అంశంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వచ్చే ఐపీఎల్లో ధోనీ ఆడతాడని, అనంతరం భారత జట్టులోనూ పునరాగమనం చేస్తాడని అన్నాడు.
"అతడు(ధోనీ) దిగ్గజ ఆటగాడు. తాను టీమిండియాకు భారం కాకూడదని అనుకుంటాడు. అతడి గురించి తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా.. మాజీ సారథి కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే వచ్చే ఏడాది మాత్రం ఐపీఎల్‌లో ఆడతాడు. ఆ తర్వాత టీమిండియాకు ఆడడానికి ఫిట్‌గా ఉన్నాడని అతడు భావిస్తే జట్టులోకి వస్తాడు" -రవిశాస్త్రి, టీమిండియా కోచ్.
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు.
ఇదీ చదవండి: 150 రంజీ మ్యాచ్‌లతో వసీం జాఫర్ రికార్డు