బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. దిల్లీలో భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌పై స్పష్టతనిచ్చాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుందని అన్నాడు.
దిల్లీ గాలి కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ కారణంగానే చాలా మంది మ్యాచ్ వేదికను మార్చాలని బీసీసీఐని కోరారు. అయితే గంగూలీ తాజా వ్యాఖ్యలతో అది జరగడం అసాధ్యమని తేలింది.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై బుధవారం మాట్లాడాడు. ప్రజలు.. క్రికెట్ కంటే కాలుష్యం తగ్గించేలా శ్రద్ధ వహించాలని అన్నాడు.
"దిల్లీలో మ్యాచ్ జరగడం కన్నా.. ఇది చాలా తీవ్రమైన సమస్య. స్థానిక ప్రజలు క్రికెట్ మ్యాచ్ కంటే కాలుష్య స్థాయిలపై దృష్టి సారించాలని భావిస్తున్నాను" -గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వచ్చే నెల 3న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
ఇది చదవండి: దిల్లీ మ్యాచ్‌కు కాలుష్య ముప్పు ఉండకపోవచ్చు: బీసీసీఐ