బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్న మార్కస్ స్టోయినిస్.. రికార్డు శతకంతో మెరిశాడు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో 79 బంతుల్లో 147 పరుగుల చేసి సత్తాచాటాడు. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ లీగ్‌లో ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోరు. ఇంతకుముందు షార్ట్ చేసిన 122 పరుగులే అత్యధికం. స్టోయినిస్‌కు టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.
స్టోయినిస్-హిల్టన్ కార్ట్‌రైట్ మధ్య ఓపెనింగ్ భాగస్వామ్యం 207 పరుగులు. బీబీఎల్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. మెల్బోర్న్ స్టార్స్ ఓపెనర్లు లూక్ రైట్-రాబ్ క్వినే చేసిన 172 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.
స్టోయినిస్ చేసిన 147 పరుగులు ఆస్ట్రేలియా తరఫున మూడో అత్యధికం. ఆరోన్ ఫించ్ చేసిన 172, 156 పరుగులు మొదటి స్థానాల్లో ఉన్నాయి.
స్టోయినిస్ శతకంతో మెల్బోర్న్ స్టార్స్.. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. బీబీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధికం. మెల్బోర్న్ స్టార్స్‌కు ఇదే ఉత్తమం. హోబర్ట్ హరికేన్స్ చేసిన 223 పరుగులు మొదటి స్థానంలో ఉంది.
-
You've just gotta watch this highlights package of Marcus Stoinis' 147no @dream11 | #BBL09 pic.twitter.com/IZqEt2VZJE
— KFC Big Bash League (@BBL) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You've just gotta watch this highlights package of Marcus Stoinis' 147no @dream11 | #BBL09 pic.twitter.com/IZqEt2VZJE
— KFC Big Bash League (@BBL) January 12, 2020You've just gotta watch this highlights package of Marcus Stoinis' 147no @dream11 | #BBL09 pic.twitter.com/IZqEt2VZJE
— KFC Big Bash League (@BBL) January 12, 2020
ఈ మ్యాచ్‌లోని తన వ్యక్తిగత స్కోరులో స్టోయినిస్.. బౌండరీల ద్వారా సాధించినవే 100 పరుగులు ఉన్నాయి. ఈ విధంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ నిలిచాడు. ఈ జాబితాలో ల్యూక్ రైట్, బెన్ మెక్డర్మొట్ చేసిన 86 పరుగులు ఇప్పటివరకు అత్యధికం.
ప్రస్తుతం బీబీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు (378) చేసిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు స్టోయినిస్. రానున్న ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడీ ఆసీస్ క్రికెటర్.
ఇవీ చూడండి.. ఆ ఓపెనర్లిద్దరి మధ్య పోటీ ఆసక్తికరం: జోన్స్