ETV Bharat / sports

రిటైర్మెంట్​పై లంక బౌలర్ మలింగ యూటర్న్ - malinga retire afrer 2 years

రిటైర్మెంట్​ నిర్ణయాన్ని మార్చుకున్నాడు శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్ మలింగ. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన ఏకైక బౌలర్​గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పేసర్.. తన వీడ్కోలును మరో రెండేళ్లకు వాయిదా వేశాడు.

మలింగ రిటైర్మెంట్​
author img

By

Published : Nov 20, 2019, 4:26 PM IST

శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ రిటర్మెంట్​పై యూటర్న్ తీసుకున్నాడు. 2020 టీ20 ప్రపంచకప్ అనంతరం వీడ్కోలు పలుకుతాడనుకున్న ఈ ఆటగాడు.. ఈ నిర్ణయాన్ని మరో రెండేళ్లకు వాయిదా వేశాడు. తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని తెలిపాడు.

"టీ20ల్లో నాలుగు ఓవర్లే బౌలింగ్ చేసేది. నా నైపుణ్యం మీద నాకు నమ్మకం ఉంది. పొట్టి ఫార్మాట్లో మరో రెండేళ్లు బౌలర్​గా కొనసాగుదామనుకుంటున్నా. కెప్టెన్​గానూ రాణిస్తానని అనుకుంటున్నా" -లసిత్ మలింగ, లంక టీ20 కెప్టెన్​

పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన ఈ పేసర్.. లంక జట్టుకు నైపుణ్యంగల బౌలర్ కావాలని చెప్పాడు.

"శ్రీలంక జట్టులో స్థిరమైన ప్రదర్శన చేసే బౌలర్ కరవయ్యాడు. మాకు నైపుణ్యం గల పేసర్ కావాలి. ఏడాది, ఏడాదిన్నరలో అది కుదరదు. స్థిరంగా ఆడడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎవరైతే జట్టులోకి వస్తారో ఈ విషయం గమనించాలి. రిజర్వ్​ బెంచ్​లో ఉంటే నేర్చుకోలేరు" - లసిత్ మలింగ, లంక టీ20 కెప్టెన్​.

2020 ప్రపంచకప్ అనంతరం అక్టోబరు, నవంబరు మాసాల్లో రిటైర్మెంట్ చెబుతానంటూ ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించాడు మలింగ. ఈ స్టార్ పేసర్ పొట్టి ఫార్మాట్​లో మళ్లీ కెప్టెనయ్యాక.. లంక జట్టు ఆడిన 10 టీ20ల్లో 8 ఓడింది. ఒక మ్యాచ్​లో గెలవగా.. ఓ మ్యాచ్ టై అయింది.

ఇదీ చదవండి:"బౌండరీ కౌంట్ నిర్ణయం.. సరైన క్రికెట్​ కాదు"

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.