ETV Bharat / sports

సన్నీలియోనీ కన్నా ధోనితోనే యమ డేంజర్​ గురూ.. - MS Dhoni,Sachin Tendulkar,P.V. Sindhu,Harmanpreet Kaur,Cristiano Ronaldo,Shraddha Kapoor,Radhika Apte,Badshah (rapper)

బాలీవుడ్​ నటి, మాజీ శృంగార తార సన్నీలియోనీ కన్నా ప్రమాదకరంగా తయారయ్యాడు భారత స్టార్​ క్రికెటర్​ ధోనీ. అతడి గురించి వెతుకుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే నెటిజన్లకు ఓ జాగ్రత్త పాటించమని చెప్తోంది సైబర్​ సెక్యూరిటీ సంస్థ మెక్​ఎఫీ.

సన్నీలియోనీ కన్నా ధోనితోనే యమ డేంజర్​ గురూ..
author img

By

Published : Oct 22, 2019, 6:30 PM IST

Updated : Oct 22, 2019, 7:10 PM IST

భారత స్టార్​ క్రికెటర్​ ధోనీకి సంబంధించిన విశేషాలు వెతుకుతున్నారా..? అయితే జాగ్రత్త అంటోంది సైబర్​ సెక్యూరిటీ సంస్థ మెక్​ఎఫీ. ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో మహేంద్ర సింగ్​ ధోనీ గురించి అంతర్జాల శోధన అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది.

భారత్​లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఒకడు. అతడి వ్యక్తిగత విషయాల నుంచి క్రీడా సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటికీ అతడి రిటైర్మెంట్​ విషయం నెట్టింట చర్చనీయాంశంగానే ఉంది. అందుకే కొన్ని నకిలీ వెబ్​సైట్లు, సైబర్​ నేరాలకు పాల్పడే వ్యక్తులు ధోనీ ఇమేజ్​ను ఉపయోగించుకుంటున్నారు. నెటిజన్లను వలలో పడేయడానికి మహీకి సంబంధించిన సమాచారాన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నట్లు సైబర్​ సెక్యూరిటీ సేవలు అందించే మెక్​ఎఫీ సంస్థ తెలిపింది.

అంతర్జాల శోధకులు ఉచితంగా, పైరేటెడ్​ విధానంలో వచ్చిన సమాచారంపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని ఈ సంస్థ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా క్రీడలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఫొటోల కోసం బాగా వెతుకుతున్నట్లు వివరించింది మెక్​ఎఫీ. అయితే వీటినే ఎరగా వేసి కొందరు సైబర్​ నేరాలకు పాల్పడుతున్నారని వెల్లడించిందీ సంస్థ.

ఈ డేంజర్​ లిస్ట్​లో టాప్​-10..

ఈ ప్రమాదకర వ్యక్తుల లిస్ట్​లో ధోనీ తర్వాత భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్​ నటుడు గౌతమ్​ గులాటి, మాజీ శృంగార తార​ సన్నీ లియోనీ మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు.

MAHENDRA SINH DHONI becomes riskiest celebrity to search online BY McAfee
సన్నీ లియోనీ, బాద్షా, రాధికా ఆప్టే

వీరితో పాటు గాయకుడు బాద్​షా, బాలీవుడ్​ బోల్డ్​ నటి రాధికా ఆప్టే, మరో హిందీ నటి శ్రద్ధా కపూర్​, క్రికెటర్​ హర్మన్​ ప్రీత్​ కౌర్​, బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు, ఫుట్​బాల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో టాప్​ 10లో నిలిచారు. అందుకే వీరి సమాచారం వెతికేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది మెక్​ఎఫీ సంస్థ.

హర్మన్​ప్రీత్​, సింధు, రొనాల్డో, శ్రద్ధా కపూర్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RUSSIAN POOL - AP CLIENTS ONLY
Sochi - 22 October 2019
1. Various of Russian President Vladimir Putin and Turkish President Recep Tayyip Erdogan greeting each other, sitting down for meeting
STORYLINE:
Turkish President Recep Tayyip Erdogan on Tuesday met Russian President Vladimir Putin in Sochi for talks on Syria.
The Kremlin earlier said Turkey needs the Syrian government's permission for the deployment of its forces on Syrian territory, indicating Moscow is hoping for Ankara-Damascus talks amid the Turkish invasion into northeastern Syria.
Kremlin spokesman Dmitry Peskov emphasised that only Damascus could authorise a legitimate presence of Turkish troops on the territory of Syria.
Ankara has so far rejected any notion of direct Turkey-Syria talks about its actions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 22, 2019, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.