వచ్చే ఏడాది జరగనున్న సీజన్లో కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. డిసెంబరు 19న ఐపీఎల్ వేలం నిర్వహించనున్న నేపథ్యంలో.. ఇప్పటికే తమ జట్లలోని కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి.
ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీస్ సహా ముగ్గురు భారత క్రికెటర్లను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వదులుకుంది. మోహిత్ శర్మ, ధ్రువ్ షోరే, చైతన్య బిష్ణోయ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చెన్నై ఫ్రాంచైజీ ఖాతాలో రూ.14కోట్లు ఉన్నందున కొత్త వారిని తీసుకొనే యోచనలో ఉంది.
-
🚨ALERT🚨: VIVO IPL 2020 Player Contract extensions announced. 127 players, including 35 overseas cricketers retained by the 8 franchises. #IPLAuction to be held on 19th December in Kolkata.
— IndianPremierLeague (@IPL) November 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Details of Players Retained and Released - https://t.co/I0KsAgMCQt pic.twitter.com/W5uUcOFt7y
">🚨ALERT🚨: VIVO IPL 2020 Player Contract extensions announced. 127 players, including 35 overseas cricketers retained by the 8 franchises. #IPLAuction to be held on 19th December in Kolkata.
— IndianPremierLeague (@IPL) November 15, 2019
Details of Players Retained and Released - https://t.co/I0KsAgMCQt pic.twitter.com/W5uUcOFt7y🚨ALERT🚨: VIVO IPL 2020 Player Contract extensions announced. 127 players, including 35 overseas cricketers retained by the 8 franchises. #IPLAuction to be held on 19th December in Kolkata.
— IndianPremierLeague (@IPL) November 15, 2019
Details of Players Retained and Released - https://t.co/I0KsAgMCQt pic.twitter.com/W5uUcOFt7y
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి జట్టు మొత్తం 12 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఆసీస్ బౌలర్ జేసన్ బెరెండార్ఫ్, అల్జారీ జోసెఫ్, ఆడం మిల్నే, బ్యూరాన్ హెండ్రిక్స్, బెన్ కట్టింగ్ లాంటి విదేశీ ఆటగాళ్లను విడుదల చేసింది. యువరాజ్ సింగ్ ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అతడినీ వదిలేసింది.
మయాంక్ మార్కాండేను దిల్లీకి అమ్మగా.. సిద్దేశ్ లాడ్‌ను కోల్‌కతా జట్టుకు విక్రయించింది ముంబయి. వీరుకాకుండా బరిందర్ శ్రాణ్, రసిక్ సలామ్, పంకజ్ జైస్వాల్, తదితరులను వదులుకుంది ముంబయి.
ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లు (జట్ల వారీగా)..
రాజస్థాన్ రాయల్స్
ఉంచింది: స్టీవ్‌స్మిత్ (కెప్టెన్), సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమ్రర్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా, మయాంక్ మర్కండే (బదిలీపై), రాహుల్ తెవాతియా (బదిలీపై), అంకిత్ రాజ్‌పుత్ (బదిలీపై)
వదులుకుంది: ఆస్టన్ టర్నర్, ఒషాన్ థామస్, శుభమ్ రంజన్, ప్రశాంత్ చోప్రా, ఇష్ సోధి, ఆర్యమన్ బిర్లా, జయదేవ్ ఉనద్కత్, రాహుల్ త్రిపాఠి, స్టువర్ట్ బిన్నీ, లియామ్ లివింగ్‌స్టన్, సుదేశన్ మిథున్
మిగులు నిధులు: రూ.28.90 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అట్టిపెట్టుకుంది: విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, యుజువేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గురుకీరత్ మన్, దేవత్ పడిక్కల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని
తీసింది: మార్కస్ స్టొయినిస్, షిమ్రన్ హెట్‌మైయిర్, అక్షదీప్ నాథ్, నేథన్ కౌల్టర్‌నైల్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, ప్రయాస్ బర్మన్, టిమ్ సౌథీ, కుల్వంత్ కేజ్రోలియా, హిమ్మత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, మలింగ్ కుమార్, డేల్ స్టెయిన్
మిగులు నిధులు: రూ.27.90 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఉంచింది: కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, బిల్లీ స్టాన్‌లేక్, బాసిల్ థంపి, టీ నటరాజన్
విడుదల చేసింది: దీపక్ హుడా, మార్టిన్ గప్తిల్, రికీ భుయ్, షకిబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్
మిగులు నిధులు: రూ.17 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్
ఉంచింది: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మోను కుమార్, ఎన్ జగదీశన్, హర్భజన్‌సింగ్, కర్ణ్‌శర్మ, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్
వదిలింది: మోహిత్ శర్మ, శామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, స్కాట్ కుగిలీన్, ధ్రువ్ షోరె, చైతన్య బిష్ణోయి
మిగులు నిధులు: రూ.14.60 కోట్లు
ముంబయి ఇండియన్స్
ఉంచింది: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్వింటన్ డికాక్, మిచెల్ మెక్లెనగన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, కృనాల్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ట్రెంట్ బౌల్ట్ (బదిలీ), రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అనుకుల్ రాయ్, ధవళ్ కుల్‌కర్ణి (బదిలీ), ఆదిత్య తారె, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (బదిలీ), జయంత్ యాదవ్
విడుదల చేసింది: యువరాజ్ సింగ్, ఎవిన్ లూయిస్, ఆడమ్ మిల్నె, బెరెన్‌డార్ఫ్, బరిందర్ శరణ్, బెన్ కటింగ్, అల్జారీ జోసెఫ్, బ్యూరాన్ హెండ్రిక్స్, రషీక్ సలామ్, పంకజ్ జైశ్వాల్
మిగులు నిధులు: రూ.13.05 కోట్లు
దిల్లీ క్యాపిటల్స్
ఉంచింది: శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, సందీప్ లమిచానె, రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచ్రందన్ అశ్విన్ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)
తీసింది: క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్ సక్సేన, మన్‌జ్యోత్ కల్రా, నాథుసింగ్, అంకుష్ బేయాన్స్, కొలిన్ మన్రో
మిగులు నిధులు: రూ.27.85 కోట్లు
కింగ్స్ XI పంజాబ్
ఉంచింది: కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, కృష్ణప్ప గౌతమ్ (బదిలీ), మహ్మద్ షమి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్షదీప్ సింగ్, హర్దస్ విల్‌జోయిన్, మురుగన్ అశ్విన్, జే సుచిత్ (బదిలీ), హర్‌ప్రీత్ బ్రార్, దర్శన్ నల్కండె
విడుదల చేసింది: డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, శామ్ కరణ్, మోజెస్ హెన్రిక్స్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అగ్నివేశ్ అయాచి, వరుణ్ చక్రవర్తి
మిగులు నిధులు: రూ.42.70 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
అట్టి పెట్టుకుంది: దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, కుల్‌దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్, లాకీ ఫెర్గూసన్, నితీశ్ రాణా, సందీప్ వారియర్, హ్యారీ గర్నీ, కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి, సిద్దేశ్ లాడ్ (బదిలీ)
విడుదల చేసింది: రాబిన్ ఉతప్ప, క్రిస్‌లిన్, పియూష్ చావ్లా, జో డెన్లీ, యర్రా పృథ్వీరాజ్, నిఖిల్ నాయక్, కేసీ కరియప్ప, మాథ్యూ కెల్లీ, అన్రిచ్ నోర్జె, శ్రీకాంత్ ముంఢె, కార్లోస్ బ్రాత్‌వైట్
మిగులు నిధులు: రూ.35.65 కోట్లు
ఇదీ చదవండి: బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్