ఏబీ డివిలియర్స్.. ఇమ్రాన్ తాహిర్, హషీమ్ ఆమ్లా.. తాజాగా ఫిలాండర్ ఇలా వరుస రిటైర్మెంట్లతో దక్షిణాఫ్రికా జట్టు అతలాకుతలమవుతోంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సఫారీ పేసర్ వెర్నన్ ఫిలాండర్ తెలిపాడు. రానున్న ఇంగ్లాండ్తో టెస్టు సిరీసే తనకు ఆఖరిదని సోమవారం ప్రకటించాడు.
ప్రోటీస్ ఆల్రౌండర్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటర్మెంట్ ప్రకటించాడు. దీర్ఘకాలికంగా దక్షిణాఫ్రికా జట్టులో అద్భుతమైన కెరీర్ కొనసాగించిన ఫిలాండర్ అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కొలు పలికాడు. జనవరిలో ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టు సిరీసే అతడికి ఆఖరది -దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ట్వీట్
రిటైర్మెంట్పై దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ భావోద్వేగంగా మాట్లాడాడు.
గత 12 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాన్నకు ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నా. అత్యుత్తమ జట్టుతో ఆడడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన నా భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపుతున్నా. నా వాళ్లు ఒడుదొడుకుల్లో నాకు తోడుగా ఉన్నారు. అలాగే అందరికంటే నాకు పెద్ద అభిమాని అయిన మా అమ్మకు ధన్యవాదాలు - ఫిలాండర్, దక్షిణాఫ్రికా బౌలర్.
దక్షిణాఫ్రికా తరఫున 60 టెస్టులు, 30 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు ఫిలాండర్. 22.16 సగటుతో 261 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. ఇప్పటికే దక్షిణాఫ్రిక జట్టులో టెస్టుల నుంచి డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ లాంటి స్టార్ పేసర్లు వైదొలిగారు.
ఇదీ చదవండి: ర్యాంకింగ్స్: తొలి రెండు స్థానాల్లో విరాట్, రోహిత్