గతేడాది హ్యాట్రిక్ సెంచరీలతో పాటు టెస్టుల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాదిలోనూ కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. అతడికిది కెరీర్లో మొదటి డబుల్ సెంచరీ. ఫలితంగా ఈ ఏడాదితో పాటు దశాబ్దంలో తొలి సెంచరీ, ద్విశతకం చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
స్మిత్ టెస్టు సగటును దాటేశాడు
ప్రస్తుతం టెస్టుల్లో రన్ మెషీన్‌గా మారుతున్నాడు లబుషేన్. వరుసగా సెంచరీలతో జోరు చూపిస్తున్నాడు. అలాగే అతడి సహ ఆటగాడు స్మిత్ టెస్టు సగటను దాటేశాడు. ప్రస్తుతం స్మిత్ యావరేజ్ 62.8 ఉండగా.. లబుషేన్ 65.4 సగటుతో దూసుకెళ్తున్నాడు.
-
Battle of the Test averages!#AUSvNZ pic.twitter.com/vo68rVSEBD
— ICC (@ICC) January 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Battle of the Test averages!#AUSvNZ pic.twitter.com/vo68rVSEBD
— ICC (@ICC) January 4, 2020Battle of the Test averages!#AUSvNZ pic.twitter.com/vo68rVSEBD
— ICC (@ICC) January 4, 2020
డబుల్ సెంచరీ సాధించిన అనంతరం 215 పరుగుల వద్ద ఔటయ్యాడు లబుషేన్. మిగతా బ్యాట్స్‌మన్‌లో స్టీవ్ స్మిత్ మాత్రమే 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 454 పరుగులకు ఆలౌటైంది.
ఇవీ చూడండి.. ఫిట్‌గా ఉంటారా.. జీతంలో కోత పెట్టమంటారా..!