ETV Bharat / sports

అగ్రస్థానంలో కోహ్లీ.. ఆరో స్థానానికి బుమ్రా - జస్ప్రీత్ బుమ్రా

ఐసీసీ సోమవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా సారథి కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్మిత్​ తర్వాతి స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో బుమ్రా ఆరో స్థానానికి పడిపోయాడు.

Kohli
స్టార్క్
author img

By

Published : Dec 16, 2019, 4:27 PM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల విభాగంలో స్టార్ పేసర్ బుమ్రా ఆరో స్థానానికి పడిపోయాడు. పాక్ బ్యాట్స్​మన్ బాబర్ అజామ్ టాప్​-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్.. కెరీర్​లో​ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ.. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​ జాబితా ఇదే.

బ్యాట్స్​మెన్

ప్రస్తుతం 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్ రెండులో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 17 పాయింట్ల అంతరం ఉంది. 791 పాయింట్లతో పుజారా, 759 పాయింట్లతో రహానే వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో వరుస సెంచరీలతో రికార్డు సృష్టిస్తోన్న ఆసీస్ ఆటగాడు లబుషేన్ (5) టాప్​-5లో చోటు దక్కించుకున్నాడు.

బాబర్ అజామ్​ రికార్డు

పాక్ ఆటగాడు బాబర్ అజామ్.. టెస్టు ర్యాంకింగ్స్​లో కెరీర్​లో తొలిసారి టాప్​-10లో స్థానం సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసి, 13 స్థానం నుంచి 9వ ర్యాంకుకు చేరాడు. ప్రస్తుతం బాబర్ టీ20ల్లో మొదటి స్థానంలో, వన్డేల్లో రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టాప్-10లో కొనసాగుతున్నాడు.

Kohli
బాబర్ ఆజామ్

బౌలర్లు

వెన్ను గాయం కారణంగా క్రికెట్​కు దూరంగా ఉన్న టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానానికి పడిపోయాడు. ఆసీస్ బౌలర్ కమిన్స్ 898 పాయింట్లతో తొలిస్థానంలో, కగిసో రబాడ 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్​తో జరిగిన టెస్టులో 9 వికెట్లతో సత్తాచాటిన మిచెల్ స్టార్క్​ కెరీర్​లో తొలిసారి టాప్​-5లో చోటు దక్కించుకున్నాడు.

Kohli
స్టార్క్

ఆల్​రౌండర్లు

ఈ విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా 406 పాయింట్లతో రెండో స్థానంలో.. వెస్టిండీస్​ క్రికెటర్ జేసన్ హోల్డర్ 473 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ర్యాంకింగ్స్​

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో టీమిండియా 360 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (216), శ్రీలంక (80), న్యూజిలాండ్ (60), ఇంగ్లాండ్ (56) పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి.. కోహ్లీ.. క్రికెట్ ఆడుతున్న రొనాల్డో: లారా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various. Various.
Decines, France. 26th August, 2019.
1. 00:00 Memphis Depay walking into training
2. 00:11 Various of Depay in training
OL Stadium, Ly
on, France.16th September, 2019.
3. 00:35 Various of Depay in training
A. Le Coq Arena, Tallinn, Estonia. 8th September, 2019.
4. 00:52 Various of Depay in training
SOURCE: SNTV
DURATION: 01:10
STORYLINE:
Netherlands star Memphis Depay suffered a cruciate knee ligament injury whilst playing for Lyon in their 1-0 defeat to Rennes on Sunday - he could potentially be out for the next six months including the Euro 2020's.
He played a huge part in Netherland's Euro 2020 qualifying - scoring six goals and assisting seven - who face Ukraine in their opening game of the competition.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.