భారత్-బంగ్లాదేశ్ మధ్య దిల్లీ వేదికగా నేడు తొలి టీ20 జరగనుంది. ఇందుకోసం అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది టీమిండియా. అయితే భారత బ్యాట్స్‌మన్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసిన యువ ఆటగాడు కేశవ్ దబాస్ రోహిత్, శిఖర్ ధావన్‌ల వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనిపై అతడి మెంటార్ సురీందర్ ఖన్నా స్పందించాడు.
" 19 ఏళ్ల వయసులో రోహిత్, ధావన్‌ల వికెట్లు తీయడం కేశవ్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. నెట్స్‌లో సీనియర్ ఆటగాళ్లకు యువ బౌలర్లు బౌలింగ్ చేయడం మంచి అవకాశం. ప్రస్తుతం రాష్ట్రం తరఫున కేశవ్ ఆడతాడు. గత సీజన్లో ఒకే ఒక్క ఛాన్స్ వచ్చినా.. ఈ సీజన్లో అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా."
-సురీందర్ ఖన్నా, కేశవ్ మెంటార్
భారత్- బంగ్లాదేశ్ మధ్య నేడు ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు రోహిత్ సారథ్య బాధ్యతలు వహించనున్నాడు. తీరిక లేకుండా ఆడటం వల్ల కోహ్లీకి విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ.