ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు మంచి డిమాండ్ లభించింది. భారీ ధరకు పలు ఫ్రాంఛైజీలు, పలువురు స్టార్ ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఇప్పుడీ విషయంపై స్పందించిన ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్.. ఈ లీగ్ వల్ల టీ20 ప్రపంచకప్ ఆడటం సులభమవుతుందని చెప్పాడు.
"వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఐపీఎల్ ఉపయోగపడుతుంది. లీగ్‌లో ఆడాలా వద్దా? అన్నది పూర్తిగా ఆటగాళ్ల నిర్ణయం. ప్రస్తుతంతో పాటు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఐపీఎల్లో ఒక్కో ఆటగాడు 10-14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అంటే ఓ జట్టు రెండేళ్లలో ఆడే మ్యాచ్‌లకు ఇది సమానం. ఈ లీగ్ వల్ల, వచ్చే టీ20 ప్రపంచకప్ కంటే ముందే ఆటగాళ్లు నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు"
-జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్
ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేసర్ కమిన్స్‌ను రూ.15.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్. హేజిల్‌వుడ్(చెన్నై), మ్యాక్స్‌వెల్(పంజాబ్), క్రిస్ లిన్(ముంబయి)లకూ మంచి ధరే లభించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌తో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమవుతోంది. మెల్బోర్న్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇవీ చూడండి.. 'గంగూలీ ప్రతిపాదన మంచిది కాదు'