టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో అభిమానులకు ఎప్పటికప్పుడూ అప్డేట్స్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ఫొటోను పంచుకుని, త్వరలో మైదానంలో అడుగుపెట్టబోతున్నట్లు సూచనిచ్చాడు.
ఆ ఫోటోలో మిడిల్ స్టంప్ విరిగిపోయి ఉంది. దానికి తోడు "ద ఎండ్" అంటూ ఓ వ్యాఖ్య రాసుకొచ్చాడు.
బుమ్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. "బుమ్రాకు సుస్వాగతం, న్యూజిలాండ్ సిరీస్‌లో నిన్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో అభిమాని "బూమ్ బూమ్ బుమ్రా.. మిడిల్ స్టంప్‌నే లక్ష్యంగా చేసుకుని సాధన చేస్తున్నావు" అని అన్నాడు.
వెన్నెముక గాయం కారణంగా బుమ్రా.. స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఇవీ చూడండి.. విండీస్‌తో టీ20లకు ధావన్ స్థానంలో శాంసన్