గాయపడిన వీరుడిపై అస్త్రాన్ని సంధించడం యుద్ధనీతికి విరుద్ధమన్నది జగమెరిగిన సత్యం. ఇదే విధానాన్ని అవలంబించి క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు శ్రీలంక బౌలర్ ఇసురు ఉడానా. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జాన్సీ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న ఇతడు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ రన్ కోసం ప్రయత్నించి గాయపడ్డాడు. బంతి తనవద్దే ఉన్నప్పటికీ అతడిని ఔట్ చేయకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.
-
Spirit of cricket🤝
— Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Raise your hand for more moments like this! Always! 🖐️🖐️🖐️🖐️#mslt20 pic.twitter.com/5nA8q9rQ2U
">Spirit of cricket🤝
— Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 8, 2019
Raise your hand for more moments like this! Always! 🖐️🖐️🖐️🖐️#mslt20 pic.twitter.com/5nA8q9rQ2USpirit of cricket🤝
— Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 8, 2019
Raise your hand for more moments like this! Always! 🖐️🖐️🖐️🖐️#mslt20 pic.twitter.com/5nA8q9rQ2U
జాన్సీ సూపర్‌లీగ్‌లో పెరల్ రాక్స్ - నెల్సన్ మండేలా బే జెయింట్స్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బే జెయింట్స్ బ్యాట్స్‌మెన్ హీనో కున్ - మార్కో మారియస్ క్రీజులో ఉన్నారు.
8 బంతుల్లో 24 పరుగులు రావాల్సిన తరుణంలో హీనో కున్ బంతిని బలంగా మోదాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మారియస్‌కు ఆ బంతి తగలగా.. గాయంతో అక్కడే పడిపోయాడు. అప్పటికే క్రీజు దాటిన బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేయడం ఇసురు ఉడానాకు పెద్ద పనేం కాదు. చేతిలో బంతి ఉన్నప్పటికీ ఔట్ చేయకుండా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు.
అనంతరం ఫిజియో రంగంలోకి దిగి అతడికి ప్రథమ చికిత్స అందించాడు. చివరి ఓవర్ మూడో బంతిని సిక్సర్ బాది జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు మార్కో. అయితే అప్పటికే చేయాల్సిన స్కోరు ఎక్కువ ఉంది. ఫలితంగా పెరల్ రాక్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇసురు ఉడానా క్రీడాస్ఫూర్తికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'తప్పు చేశా.. తక్కువ శిక్ష పడుతుందని అనుకుంటున్నా'