భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టును డే అండ్ నైట్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పింక్ బాల్తోతొలిసారిగా ఆడనున్న ఇరుజట్లలో.. తమకే ఎక్కువ అనుకూలిస్తుందని బంగ్లా కోచ్ రసెల్ డొమింగో అభిప్రాయపడ్డాడు. గులాబీ బంతితో ఆడిన అనుభవం ఇరుజట్లకు లేదని, అయితే మ్యాచ్ తమకే కలిసొస్తుందని అన్నాడు.
"టీమిండియా బలమైన జట్టని మాకు తెలుసు. వాళ్లు ప్రపంచ నెంబర్ వన్ జట్టు కావచ్చు. కానీ పింక్ బంతితో ఆడిన అనుభవం వారికి లేదు.. మాకూ లేదు. అయితే ఇది మా జట్టుకు గొప్ప అవకాశం. ఈ మ్యాచ్ మాకు కలిసొచ్చే అవకాశముంది. ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సందడి నెలకొనబోతుంది. అన్ని ఫార్మాట్లలో మేటి జట్టైన టీమిండియాతో తలపడబోతున్నాం. ఈ సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంటాం" - రసెల్ డొమింగో, బంగ్లాదేశ్ కోచ్
బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి 10 వరకు మూడు టీ 20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. నవంబరు 14 నుంచి 26 వరకు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుండగా, రెండో టెస్టు కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: విచిత్రమైన ఈ క్రికెట్ బ్యాట్లను ఎప్పుడైనా చూశారా..?