వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు 5 పరుగుల తేడాతో విజయం సాధించారు. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు కాసేపు అడ్డంకిగా మారాడు. ఫలితంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా అమ్మాయిలు పెద్దగా రాణించలేకపోయారు. పూజ(10) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో మాథ్యూస్ (3/13) సత్తా చాటింది. అద్భుత ప్రదర్శన చేసిన మ్యాథ్యూస్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 45 పరుగులే చేసింది. అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ చివరి మ్యాచ్‌ను నవంబర్ 20న ఆడనుంది.
ఇదీ చదవండి: 'ఏటీపీ ఫైనల్స్' విజేతగా గ్రీస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్